నన్ను చంపితే డబ్బులు ఇస్తానన్నది ఎవరు అనేది పోలీసులు తేల్చాలి…….. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కొట్టం రెడ్డి శ్రీధర్ రెడ్డి

మన ధ్యాస,నెల్లూరు రూరల్ ,ఆగస్టు 30: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కొట్టం రెడ్డి మాట్లాడుతూ………..నిన్న ఒక వీడియో చూసి షాక్ కి గురయ్యా,హుందా రాజకీయాలకు చిరునామా అయిన నెల్లూరులో రౌడీ షీటర్లు మాట్లాడుకోవడం చూసా అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నన్ను చంపేయాలని రౌడీ షీటర్లు అందరూ మాట్లాడుకున్నారు అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. వెంటనే ఎస్పీ మూడు రోజుల ముందు నుంచే మా నోటీసులో ఈ వీడియో ఉందని చెప్పారు, కనీసం నాకు సమాచారం ఇవ్వలేదు,నాకు జాగ్రత్త కూడా చెప్పలేదు అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.రౌడీ షీటర్లు నన్ను చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా, ఎవరు వారికి డబ్బు ఇస్తామన్నారు. ఒక పౌరుడిగా నేను అడుగుతున్నా. పోలీసు విచారణలో తేలాలి అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నేను ఎవరిపై ఆరోపణలు చేయలేదు, ఎవరి గురించి మాట్లాడలేదు, గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే వైసీపీ, వారి సోషల్ మీడియా, సాక్షి రోత పత్రిక తడుముకుంటోంది అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. వైసీపీ బాధ్యతల్ని మర్చిపోయి అసెంబ్లీకి రాకుండా తప్పించుకు తిరుగుతున్నారు ,నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కుట్ర అంటూ వైసీపీ ప్రచారం చేసింది అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆ సంప్రదాయం మా కుటుంబంలో లేదు ,రాజ్యం కోసం సొంత ఇంట్లో వాళ్ళని చంపే రాజకీయం మీ డిఎన్ఏ లో ఉంది అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. బెదిరింపులకి నేను భయపడను, విఆర్ కళాశాల నుంచే పోరాటాలు చేశా, విద్యార్థి నేతగా రౌడీలని తరిమిన చరిత్ర నాది, నా చరిత్ర వైసీపీ నేతలకు బాగానే తెలుసు, చాలా కాలం వాళ్లతో కలిసి పని చేశా అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. 25 ఏళ్ళు రాజ్యం మాదే అని జగన్ మాట్లాడుతున్న రోజుల్లోనే జగన్ ని వదిలి బయటకు వచ్చా, అప్పుడు కూడా నన్ను, నా కుటుంబ సభ్యులని బెదిరించారు, ఆనాడే నేను దేనిని లెక్కచేయలేదు అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. బండికి కట్టి తీసుకువెళ్లి లేపేస్తా అని ఒకడు అన్నాడు, అప్పుడే బయపడలేదు, మేము తప్పు చేయం, భయపడం,నా కార్యకర్తల కోసం కొండలనైనా, బండలనైనా ఎదుర్కొనే నైజం నాది, ఈ విషయాన్ని వైసీపీ గుర్తు పెట్టుకోవాలి అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నా మీద ఎన్ని వీడియోలు అయినా వైసీపీ సోషల్ మీడియాలో పెట్టుకోండి ,అధికారంలో ఉన్నా, లేకున్నా నేను వారి కుటుంబ సభ్యుడిని అని కార్యకర్తలు, ప్రజలు నన్ను నమ్మారు, అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు ని చూసి వైసీపీ నేతలకు బాధ, నన్ను చంపితే డబ్బు ఇస్తామన్న వారు ఎవరు అనేది పోలీసు శాఖ తేల్చాలి అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.మీ బుడ్డ బెదిరింపులని నేను కాదు, నా కార్యకర్తలు కాదు కదా.. నా 6 ఏళ్ళ మనవడు కూడా భయపడడు. భయపడుతూ భయపడుతూ బ్రతికే అలవాటు మాకు లేదు అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఊపిరి ఉన్నంత వరకు నేను ప్రజాజీవితంలో ఉంటా అని నెల్లూరు రూరల్ అభివృద్ధికి కట్టుబడి ఉంటా,మూడో సారి ఎమ్మెల్యే అయి 14 నెలలు అయింది.. ఏ ఒక్క వైసీపీ కార్యకర్తని అయినా నేను ఇబ్బంది పెట్టానా అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నా అభిమానులు ఎవరు ఎలాంటి భయాందోళనకు గురి అవ్వద్దు,వైసీపీ హయాంలోనే నాకు ఇద్దరు గన్ మెన్ లని తొలగించారు, అప్పుడే మిగిలిన ఇద్దరి గన్ మెన్లని కూడా వెనక్కి పంపించా అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నాకు గన్ మెన్లు లేని రోజుల్లోనే కార్యకర్తలు నాకు అండగా నిలిచారు,నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

  • Related Posts

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..