నెల్లూరులో తొలి కంటైనర్ విద్యుత్ సబ్ స్టేషన్ ని ప్రారంభించిన రాష్ట్ర పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

మన ధ్యాస,నెల్లూరు ,ఆగస్టు 30: నెల్లూరులో తొలి కంటైనర్ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభం – గాంధీ బొమ్మ సెంటర్లోని స్వతంత్ర పార్కులో ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ – తక్కువ స్థలంలో ఏర్పాటు చేసిన కంటైనర్ సబ్ స్టేషన్ తో ఎక్కువ గృహాలకు ప్రయోజనం- విద్యుత్ సరఫరా లో హెచ్చుతగ్గులను నివారించేందుకు ప్రత్యన్మయ మార్గం – కంటైనర్ సబ్స్టేషన్ ప్రయోజనాన్ని వివరించిన మంత్రి నారాయణ మన ధ్యాస ,నెల్లూరు, ఆగస్టు 30:అధునాతన టెక్నాలజీతో రూపొందించిన కంటైనర్ సబ్ స్టేషన్ తో ఎన్నో లాభాలు ఉన్నాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నడిబొడ్డున ఉన్న గాంధీ బొమ్మ సెంటర్, పొగతోట, ట్రంకు రోడ్డు, తదితర ప్రాంతాలలో విద్యుత్ హెచ్చుతగ్గులు నిరోధించడానికి కంటైనర్ సబ్ స్టేషన్ కు మంత్రి శనివారం నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. 46 వ డివిజన్ గాంధీ బొమ్మ వద్ద ఉన్న స్వతంత్ర పార్కులో నాలుగు కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో ఏపీ ఎస్పీడీసీఎల్ సౌజన్యంతో కంటైనర్ సబ్స్టేషన్ ను ఏర్పాటు చేశారు. కంటైనర్ విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రికి విద్యుత్ శాఖ అధికారులు, టిడిపి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ……… నెల్లూరులో తొలిసారిగా కంటైనర్ సబ్స్టేషన్ను చేయడం జరిగిందన్నారు. ఇది పూర్తిగా రిమోట్ ఆధారిత సబ్ స్టేషన్ అని తెలిపారు. మామూలుగా విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటుకు సుమారుగా ఐదు నుంచి పది ఎకరాల వరకు స్థలము అవసరం ఉంటుందని, అయితే సాంకేతికతను ఉపయోగించి అతి తక్కువ స్థలంలో కంటైనర్ సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. కంటైనర్ సబ్స్టేషన్కు కేవలం నాలుగు లేదా ఐదు సెంట్లు స్థలంలో రూపకల్పన చేయడం జరిగిందని తెలిపారు. సుమారు కిలోమీటర్ పరిధిలో విద్యుత్ హెచ్చుతగ్గులు లేకుండా నిరంతర విద్యుత్తును అందించే విధంగా ఉపయోగపడుతుందన్నారు. సబ్స్టేషన్ ద్వారా దాదాపు 5000 మంది వినియోగదారులకు ఉపయోగం కలుగునుందని మంత్రి నారాయణ తెలియజేశారు. అనంతరం నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్,నూడా ఛైర్మెన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ ,46వ డివిజన్ ప్రెసిడెంట్ కోకు మహేందర్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ సత్యనాగేశ్వర రావు…కో క్లస్టర్ అజయ్.ఏపీ ఎస్పీడీసీఎల్ సూపరిండెంట్ ఇంజనీర్ విజయం,టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..