

మన ధ్యాస, నెల్లూరు, ఆగస్టు 28 :ఎన్నడూ లేని విధంగా రెండో పంటకు నీళ్లు ఇచ్చిన తర్వాత కూడా సుమారు 100 టిఎంసిల నీరు నిల్వ ఉండడం నెల్లూరు జిల్లా తాగునీటి చరిత్రలో ఒక నూతన అధ్యయనం అని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.నెల్లూరు సంతపేటలోని క్యాంపు కార్యాలయంలో గురువారం జిల్లాలోని జలాశయాల్లో నీటి నిల్వల పరిస్థితిపై పాత్రికేయుల సమావేశం నిర్వహించిన మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి.ఈ సందర్బంగా మంత్రి ఆనం మాట్లాడుతూ………. జిల్లాలో సమృద్ధిగా నీటి నిల్వలు సోమశిల, కండలేరు, తెలుగు గంగ ప్రాజెక్టుల్లో సుమారు 90 నుంచి 100 టీఎంసీల నీళ్లు ఉన్నాయి అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలో చేపట్టిన సమర్థవంతమైన సాగునీటి నిర్వహణ వలన నేడు జిల్లాలో సమృద్ధిగా నీటి నిల్వలు ఉన్నాయి అని అన్నారు.దాదాపు ఉమ్మడి నెల్లూరు జిల్లా తో పాటు సత్యవేడు శ్రీకాళహస్తి జిల్లాలను కలుపుకొని దాదాపు ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడం జరిగింది అని అన్నారు.రెండవ పంటకు నీళ్లు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు వాటి గురించి ఆలోచిస్తే సోమశిల, తెలుగు గంగా ప్రాజెక్టుల్లో మొదటి పంట తరువాత కూడా రెండవ పంటకు నీళ్లు అందించిన మిగులు నీళ్లు ఉన్నాయి అని అన్నారు.ఉమ్మడి నెల్లూరు జిల్లా సత్యవేడు శ్రీకాళహస్తి కలిపి ఐదు లక్షల 24 వేల ఎకరాలకు రెండో పంటకు నీళ్లు ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు.ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు రెండో పంటకు నీళ్లు ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు. రెండో పంట చివరి దశకు వచ్చింది. ఇంకో 20,25 రోజుల్లో వరి కోతలు మొదలవుతున్నాయి అని అన్నారు.సోమశిల జలాశయంలో 59 టీఎంసీల నీళ్లు రెండో పంట చివరి దశకు వచ్చిన నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి అని అన్నారు.తెలుగు గంగా రిజర్వాయర్లో 35 టీఎంసీల నీళ్లు జలాశంలో ఉన్నాయి అని అన్నారు. దాదాపు 90 నుంచి 94 టీఎంసీల నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి అని అన్నారు.ఇది సమర్థవంతమైన పాలనకు నిదర్శనం అని అన్నారు.ఒక్క చుక్క నీరు కూడా వృధా కాకుండా, ప్రతి పంటకు నీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. రైతన్నల కళ్ళల్లో ఆనందం చూడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.రైతన్నలు కూడా ప్రతి నీటి చుక్కను ఉపయోగించుకోవాలి గాని అనవసరంగా వృధా చేయకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్న అని అన్నారు.సముద్రంలోకి ఒక్క చుక్క నీరు కూడా వృధాగా పోకూడదని ప్రాజెక్ట్ లు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం అని అన్నారు. రైతన్నలు కూడా ప్రతి చుక్క నీరును ఉపయోగించుకోండి, సముద్రం పాలు చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్న అని అన్నారు.రైతన్న లు కేవలం ఒక్క వరి పంట పైనే ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటే, వాటి ధరలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి అని అన్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితుల్లో రైతన్నలు ఉన్నారు అని అన్నారు.రైతన్నలు కూడా రెండో పంటగా కమర్షియల్ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్న అని అన్నారు. రైతన్నలు కూడా పురుగుమందులు వాడకంలో యూరియా వాడకంలో మోతాదుకు మించి వాడి పంటను, పంట దిగుబడిని తగ్గించకుండా ఉండాలని కోరుకుంటున్నా అని అన్నారు. సరైన మోతాదులో వాడి పంటను పంట పొలాలలో కాపాడాలని కోరుతున్నా అని అన్నారు.దయచేసి రైతన్నలు కూడా ఆలోచించాలి రాబోయే కాలంలో సమృద్ధిగా నీరు ఉన్నప్పుడు మొదటి విడతలో వరి పంటకు ప్రాధాన్యత ఇవ్వాలని అలాగే రెండో పంటగా కమర్షియల్ పంటను పండించే ఆలోచన చేయాలని ప్రభుత్వం తరఫున వేడుకుంటున్న అని అన్నారు. సోమశిల కు భారీ స్థాయిలో నీరు వస్తూ ఉంది. దాదాపు 18 వేల క్యూసెక్కుల నీరు వస్తుంది. భవిష్యత్తులో పండించే పంటకు సమృద్ధిగా నీరు అందుబాటులో ఉంటుంది అని అన్నారు.గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల, ఏదో ఉద్ధరిస్తామని చేసిన ప్రయత్నం వల్ల… దాదాపు 12 వేల క్యూసెక్కుల నీరు సోమశిల నుంచి ఊరకనే గేట్లు ఎత్తి కండలేరుకు పంపించే ప్రయత్నం చేశారు. మన జిల్లా తెలుగుగంగా ప్రాజెక్టులో ఉన్నది అని అన్నారు.దురదృష్టం వల్ల ఆనాటి ప్రభుత్వం ఆనాటి పాలకుల అనాలోచితం వల్ల ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రికి ఒక ఆలోచన విధానం లేకుండా 12 వేల క్యూసెక్కు 24 వేల క్యూసెక్కులకు చేస్తామని టెండర్లను పిలిచి కమిషన్ల కొరకు పనులు ప్రారంభించి మధ్యలో వదిలేసి వెళ్లిపోయారు అని అన్నారు.మనకు ఎన్నో రిజర్వాయర్ లు ఉన్నాయి. నెల్లూరు రిజర్వాయర్, కలిగిరి, సర్వేపల్లి, అల్లూరు, రామతీర్థం వంటి పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి అని అన్నారు. అన్ని రిజర్వాయర్లు నూటికి నూరు శాతం నింపడానికి అవకాశం లేదు అని అన్నారు.ఈ వర్షాకాలంలో వచ్చే వర్షాల వల్ల ఈ రిజర్వాయర్లు అన్ని సమృద్ధిగా నీటిని నింపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు అని అన్నారు.నేడు సోమశీల, తెలుగు గంగ నేడు నిండుకుండలా ఉన్నాయి అని అన్నారు.గతంలో నెల్లూరు బ్యారేజీ ఆరు టీఎంసీలు నీరు ఉండేది ఇప్పుడు ఒక శాతానికి పెరిగింది, సంగం బ్యారేజ్ టీఎంసీల నీరు పెరిగింది అని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్, బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్ల రిజర్వాయర్ వరకు నీటిని తీసుకువస్తే రాయలసీమకు రెండో పంటకు కూడా సమృద్ధిగా నీళ్లు ఇవ్వొచ్చు అని అన్నారు. ఇది మన రాష్ట్రం తో పాటు పరిసర రాష్ట్రాల్లో కూడా ముడిపడి ఉన్న అంశం అని అన్నారు. అన్ని రాష్ట్రాలతో చర్చలు సఫలీకృతం కావాలని కోరుకుంటున్నా అని అన్నారు. వీటిపై కొందరు వితండవాదం చేస్తున్నారు అని అన్నారు. ఇప్పటికే పోలవరం నిండిపోయింది, పోలవరం ప్రాజెక్టు పూర్తయిన నాగార్జునసాగర్, శ్రీశైలం నిండిపోతే నీళ్లు ఎక్కడ నిలపాలో కూడా అర్థం కావడం లేదు అని అన్నారు. బంగాళాఖాతంలోకి నీళ్లు వెళ్ళేటువంటి ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టు రిజర్వాయర్ నిర్మించి వాటర్ లిఫ్ట్ చేసుకుని, వాటిని బొల్లాపల్లి రిజర్వాయర్ కు బనకచర్ల రిజర్వాయర్ కు పైపుల ద్వారా తెప్పించి రాయలసీమకు నీరందించాలని చూస్తుంటే , పక్క రాష్ట్రాల వాళ్లు రాజకీయ లబ్ధి కోసం అడ్డుపడుతున్నారు అని అన్నారు. సముద్రంలో కలిసేటువంటి ప్రాంతం నుంచి నీళ్లు తోడుకుంటుంటే వద్దు అంటున్నారు అని అన్నారు.కేంద్ర ప్రభుత్వ దృష్టిలో కూడా ఈ సమస్య గురించి చర్చ ఉంది అని అన్నారు.కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా అన్ని వివరాలకు సమగ్ర సమాచారం వారి వద్ద ఉంది అని అన్నారు.దాదాపు 84 వేల కోట్ల రూపాయల నదుల అనుసంధానానికి ఖర్చవుతుంది అని అన్నారు. భవిష్యత్ తరాలకు సమృద్ధిగా నీరు అందించాలని లక్ష్యమే మా కూటమి ప్రభుత్వా లక్ష్యం అని అన్నారు.అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో పోలవరం పూర్తవుతుంది అని అన్నారు.త్వరలోనే బనకచర్ల ప్రాజెక్టు కూడా వినియోగంలోకి వస్తుంది అని అన్నారు.గడిచిన వైసిపి ప్రభుత్వ హాయంలో హంద్రీనీవా ప్రాజెక్టును 400 కోట్ల రూపాయల ఖర్చు పెట్టలేక ప్రాజెక్టును పక్కకు నెట్టారు అని అన్నారు.రిజర్వాయర్ల విషయంలో నీటి నిల్వల విషయంలో అప్పటి వైసీపీ పాలకులకు సరైన అవగాహన లేక ఆంధ్రప్రదేశ్లో రైతాంగం పూర్తిగా నష్టపోయింది అని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేయడం జరిగింది అని అన్నారు.మొన్న కాలువల ద్వారా నీళ్లు వచ్చినప్పుడు కుప్పం రైతుల కళ్ళలో ఆనందం అంతా ఇంత కాదు అని అన్నారు. కృష్ణ గోదావరి నదుల జలాలను కలిపి రాయల సీమకు సమృద్ధిగా నీరు అందించాలని చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారు.

