

కార్యకర్తలతో మమేకమైన బొల్లినేని వెంకట రామారావు
కలిగిరి : మన న్యూస్ ప్రతినిధి నాగరాజు ://///
కలిగిరి మండల కేంద్రంలోని ప్రధాన సెంటర్లోని టీ దుకాణం వద్ద టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లినేని వెంకట రామారావు స్థానిక కార్యకర్తలతో కలసి టీ తాగుతూ స్నేహపూర్వకంగా మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో సరదాగా గడుపుతూ, పట్టణంలోని ప్రస్తుత పరిస్థితులు, స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాల గురించి ఆరా తీశారు. అక్కడికి విచ్చేసిన ప్రతి కార్యకర్తను అప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు.కార్యకర్తలు తమ సమస్యలు, గ్రామంలో జరుగుతున్న విషయాలను వివరించగా, బొల్లినేని వెంకట రామారావు అవన్నీ శ్రద్ధగా విని స్పందించారు. పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.