

మన ధ్యాస తవణంపల్లి ఆగస్టు-23 చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని అరగొండ గ్రామంలో అప్పులు కట్టలేక వ్యక్తి మృతి. తవణంపల్లె ఎస్సై చిరంజీవి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి తవణంపల్లి మండలం, అరగొండ పంచాయితీ అరగొండ గ్రామానికి చెందిన డి సుధీర్ కుమార్: 31 సంవత్సరం తిరుపతిలో డ్రైవింగ్ పనిచేసుకొంటూ, తన భార్య, పిల్లలతో అక్కడే ఉంటున్నారు. తిరుపతిలో ఎక్కువ అప్పులు చేసి. ఆ అప్పులు కట్టలేక ఇప్పటికి సుమారు మూడు నెలల క్రితం. డి సుధీర్ కుమార్ తన కుటుంబము తో కలసి అరగొండకి వచ్చి ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఏమి పనిచేయకుండా ఖాళీగానే ఉంటున్నాడు. ఈ విషయముగా డి సుధీర్ కుమార్ అతని భార్య ఇరువురూ గొడవపడి సుదీర్ కుమార్ అప్పులు ఎక్కువ చేసి వాటిని కట్టలేక, జీవనోపాది లేక జీవితము మీద విరక్తి చెంది, చనిపోవాలనే ఉద్దేశముతో తనంతట తానె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు, ఈ విషయముగా డి సుధీర్ కుమార్ వాళ్ళ అమ్మ డి కళావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తవణంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడమైనది. కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్నది.