శ్రీకాంత్ పెరోల్ విషయంలో రాష్ట్ర వైసీపీ నేతలు ,నెల్లూరు రూరల్ వైసిపి ఇన్చార్జ్ ,వైసీపీ సోషల్ మీడియా దృషప్రచారం చేస్తున్నాయి…………… నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు రూరల్, ఆగస్టు 23: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ విలేకరులు ఆయన సమావేశంలో మాట్లాడుతూ………,తక్కువ మాట్లాడి, ఎక్కువ పని చేయాలని ప్రజల ఆకాంక్ష. అందుకే రాజకీయం విషయంలో తక్కువ, ప్రజా సమస్యలపై ఎక్కువ మాట్లాడుతా అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. శ్రీకాంత్ పెరోల్ విషయంలో రాష్ట్ర వైసీపీ నేతలు వైసీపీ రూరల్ ఇంచార్జ్, వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి అన్నారు. శ్రీకాంత్ కి పెరోల్ ఇవ్వాలని ఆయన తండ్రి నా దగ్గరకి వస్తే సిఫార్సు లేఖ ఇచ్చాను అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు . వివిధ సమస్యలతో వచ్చే వారికి ఎమ్మెల్యేలు లేఖలు ఇస్తారు. అధికారులు వాటిని పరిశీలించి సమాధానం చెబుతారు. జూలై 16న నా లేఖ, గూడూరు ఎమ్మెల్యే సునీల్ లేఖలను తిరస్కరిస్తూ అధికారులు మా ఇద్దరికీ రాత పూర్వక సమాధానం ఇచ్చారు అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. జులై 30న అధికారులు పెరోల్ మంజూరు చేశారు. 16వ తేదీ మా లేఖలని తిరస్కరించి 14 రోజుల తర్వాత పెరోల్ మంజూరు చేశారు. దీనిపై విచారిస్తున్నామని హోమ్ మంత్రి చెప్పారు అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.లేఖలు ఇవ్వడమే తప్పు అని వైసీపీ అంటోంది. అయితే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య లు ఇదే శ్రీకాంత్ కి లేఖలు ఎలా ఇచ్చారు. ఆ లేఖలు ఆధారం చేసుకుని శ్రీకాంత్ కి పెరోల్ కూడా ఇచ్చారు అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖలని నేను తప్పు పట్టను, లేఖలు ఇవ్వడం సాధారణం, అధికారులు నియమ నిబంధలకి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఇకపై నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఎవ్వరికీ పెరోల్ విషయంలో లేఖలు ఇవ్వను. ప్రతి విషయం రాజకీయ నాయకులకి పాఠాలు నేర్పిస్తుంది. నేను రాజకీయాల్లో నిరంతర విద్యార్థినే అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నేను దందాలు చేసి ఉంటే అధికారానికి 18 నెలల ముందే నేను ముఖ్యమంత్రి జగన్ ని విభేదించి బయటకు వచ్చా. నా మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. 2004 నుంచి 2014 మధ్యలో రూరల్ లో అప్పటి అధికార పార్టీ ఇంచార్జ్ గా ఇప్పటి వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న వ్యక్తి హయాంలో హత్యలు, ఇసుక, గ్రావెల్ స్మగ్లింగ్ గురించి మాట్లాడుదామా.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల్లూరు రూరల్ లో ఏ ఒక్క వైసీపీ కార్యకర్తని అయినా వేధించామా. దాడులు చేసామా అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అధికారంలో నుంచి 18 నెలల ముందు నేను బయటకి వచ్చినప్పుడు నన్ను, నా కుటుంబ సభ్యులని, మా నాయకులని మీరు ఎలా వేదించారో గుర్తు చేసుకోండి అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆ వేధించిన వారిపై నేను ప్రతీకారం తీర్చుకోవాలంటే చుక్కలు చూపించేవాడిని, నరకం ఎలా ఉంటుందో చూపించేవాడిని అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు మా చేతులు కట్టేశారు. లోకేష్ అంగీకరించరు కాబట్టి సైలెంట్ గా ఉన్నాం. గీత దాటితే చంద్రబాబు తాట తీస్తారు కాబట్టి వారి అదేశాలని తూచా తప్పక పాటిస్తున్నాం అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలు, మంత్రులకు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఖచ్చితమైన సూచన చేశారు అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు . నా వెంట నడిచిన అనేక మంది కార్యకర్తలకి నేనే వ్యక్తిగతంగా ఆర్ధిక చేయూతని అందించా. కార్యకర్త భుజంపై చెయ్యి వేసి నవ్వితే సరిపోదు. వారి పరిస్థితి తెలుసుకోవాలి అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.వైసీపీ నేతలరా ఆరోగ్యకరమైన రాజకీయాలు చేద్దాం. అంతే కాని నన్ను గెలకవద్దు. అవసరం అయితే మీ బాషలోనే ఇంకా పదింతలు మాట్లాడగలం అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు