

మన న్యూస్ తవణంపల్లె ఆగస్ట్-19 తవణంపల్లి మండల కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ను జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పడేల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన బంక్‌లోని రికార్డులు, లైసెన్స్ పత్రాలు, పరిశుభ్రత, పెట్రోలు పంపుల మీటర్లు తదితరాలను శ్రద్ధగా పరిశీలించారు. పెట్రోల్ పంపులు సక్రమంగా పనిచేస్తున్నాయా, వినియోగదారులకు సరైన మోతాదులో ఇంధనం అందుతున్నదా అన్న అంశాలను ప్రత్యేకంగా పరిశీలించారు. తనిఖీ అనంతరం మాట్లాడిన జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్, “ప్రజలకు మోసం జరగకుండా ఉండేలా బంక్ యాజమాన్యం అన్ని విధాలా నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. రికార్డులు, లైసెన్సులు, పరిశుభ్రతలో ఎలాంటి లోపాలు ఉండకూడదు” అని సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో మండల తహసిల్దార్ సుధాకర్, విఆర్ఓ, కార్యదర్శి, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.