

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించి ఉత్తమ విఆర్వో అవార్డు అందుకున్న అవసరాల కిషోర్ పలువురికి ఆదర్శప్రాయుడని ఏలేశ్వరం టౌన్ వైసీపీ అధ్యక్షుడు శిడగం వెంకటేశ్వరరావు,రాష్ట్ర వైసీపీ యువజన విభాగ కార్యదర్శి బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు అన్నారు.79 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కలెక్టర్ సగిలి షన్మోహన్ మరియు ఇతర ముఖ్య అధికారుల చేతుల మీదుగా ఉత్తమ విఆర్వో అవార్డు పొందిన ఏలేశ్వరం విఆర్వో అవసరాల కిషోర్ ని వైఎస్ఆర్సిపి ఏలేశ్వరం టౌన్ అధ్యక్షుడు శిడగం వెంకటేశ్వరరావు,రాష్ట్ర వైసీపీ యువజన విభాగ కార్యదర్శి ఆధ్వర్యంలో బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు ఆధ్వర్యంలో శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘన సన్మానం చేశారు.ఈ సందర్భంగా టౌన్ వైసీపీ నాయకులు విఆర్వో అవసరాల కిషోర్ ఉత్తమ సేవలను కొనియాడుతూ భవిష్యత్తులో మరెన్నో అవార్డులు,రివార్డులు పొందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దలే కిషోర్,సుంకర హైమావతి రాంబాబు,సామంతుల హైమావతి సూర్యకుమార్,కోరాడ రామలక్ష్మి ప్రసాద్,కో ఆప్షన్ సభ్యుడు వాగు బలరాం,పైలా విజయ్ కుమార్,డేగల చంద్రమౌళి,పేకల జాన్,దత్తి రాజా,లోగీసు శేఖర్,పట్టా సుబ్బారావు,టౌన్ వైసీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.