

మన న్యూస్ తవణంపల్లె ఆగస్ట్-14
తవణంపల్లి మండల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎగువ తడకర ఈ. వెంకటాపురం పాఠశాలను గురువారం మండల విద్యాశాఖ అధికారి హేమలత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులు ఉపాధ్యాయులు హాజరు పట్టికను పరిశీలించడం జరిగింది. అలాగే 11 వ తారీకు నుంచి జరిగిన ఫార్మేట్ పరీక్ష అసెస్మెంట్ బుక్స్ ను తరగతి వారీగా పరిశీలించి పలు సలహాలు సూచనలు అందించారు. అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కొరకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చాముండేశ్వరి మరియు సిఆర్పి చిట్టిబాబు పాల్గొన్నారు.