

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: దివంగత నేత వరుపుల రాజా జయంతి సందర్భంగా నియోజవర్గ వ్యాప్తంగా పలు స్వచ్ఛంద కార్యక్రమాలు గురువారం నిర్వహించారు.దీనిలో భాగంగా ఏలేశ్వరం పట్టణంలో ఎస్సీ బీసీ హాస్టల్ లో స్మార్ట్ టీవీ లను వరుపుల రాజా కుమార్తె మాధురి అందజేశారు.ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ తన తండ్రి నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేశారని, అనేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి నిరుపేదలకు ఖరీదైన వైద్య సహాయం అందజేశారు అన్నారు. నా తండ్రి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులకు టీవీలు బహుకరించినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి,కౌన్సిలర్లు బొద్దిరెడ్డి గోపి,మూది నారాయణస్వామి,జ్యోతుల పెద్దబాబు,పెంటకోట మోహన్,పలివెల వెంకటేష్,ఎర్రబత్తుల గోవింద నాయుడు,సామంతుల గోపి,వాగు రాజేష్, నూకతాటి ఈశ్వరరావు, శ్రీధర్,పడవాటి రమేష్,మామిడి లలిత తదితరులు పాల్గొన్నారు.