సాంకేతిక లోపం. అన్నదాత సుఖీభవ పథకం శాపం.

మ్యాపింగ్ విభజనఆప్షన్ లేని కారణంగా అన్నదాతల అవస్థలు. మన న్యూస్. ఉరవకొండ: సాంకేతికత లోపం కారణంగా అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారులకు తీవ్ర శాపంగా మారింది. ఒకే కుటుంబంలో ప్రభుత్వ పథకానికి ఒకరే లబ్ధి అనే అర్హత నియమం చెబుతోంది. అయితే వేరు వేరు కాపురాలు ఉంటున్న లబ్ధిదారులకు, వేరు వేరు రేషన్ కార్డులు ఉన్నప్పటికీ మ్యాపింగ్ విభజన ఆప్షన్  లేని కారణంగా ఒకే కుటుంబంలో మ్యాపింగ్ చేయటంతో అది వారి పాలిట తీవ్ర శాపంగా మారింది. కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం యోజన పథకం కింద రెండు వేలు, రాష్ట్ర ప్రభుత్వ పథకం అన్నదాత సుఖీభవ పథకం కింద ఐదు వేలు మొత్తం వేసి అందక అన్నదాతల్లో ఆందోళన అలుముకుంది. ఇది ఇలా ఉండగా కొందరి లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వ సహాయం అందితే, రాష్ట్ర ప్రభుత్వ సాయం అన్నదాత సుఖీభవ యోజన పథకం జమ కావడం లేదనే ఆరోపణలు సర్వత్ర వినిపిస్తున్నాయి. మరికొందరికి అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధి చేకూరితే పిఎం కిసాన్ యోజన పథకం అందటం లేదు దీంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది.
అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందంగా వీటికి తోడు వేరువేరు కాపురాలు ఉంటున్నప్పటికీ, కార్డులు విభజన అయినప్పటికీ వాలెంటర్ తప్పిదం కారణంగా ఉమ్మడి కుటుంబంలో మ్యాపింగ్ చూపిస్తున్న కారణంగా జిల్లా వ్యాప్తంగా వందలాది మంది అన్నదాతలకు ప్రభుత్వ పథకాలు చేకూరకుండా అర్హతలకు త్రిలోద కాలుస్తున్నాయి. ఆర్థిక మంత్రి ఇలా కాలనీ అర్హతనున్న అన్నదాతలు మ్యాపింగ్ విభజన ఆప్షన్ లేని కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సాయాలకు దూరమవుతున్నామనే ఆందోళనలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి మ్యాపింగ్ విభజన ఆప్షన్ తెప్పిస్తే పలువురు లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుంది.
ఇది ఇలా ఉండగా ఎం విజయలక్ష్మి అనే మహిళా రైతుకు ఎం నిర్మల అనే మహిళ రైతు వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. చేరొకరికి రేషన్ కాళ్లు ఉన్నాయి. ఇరువురు పిఎం కిసాన్ యోజన అన్నదాత సుఖీభవ పథక లబ్ధిదారులు. కాగా ఒకే కుటుంబంలో మ్యాపింగ్ ఉన్నట్లు చూపించటంతో చెల్లెలికి పథకాలు వర్తించాయి. అక్కకు పథకాలు వర్తించలేదు. అదేమిటని ప్రశ్నిస్తే ఇరువురిని వాలంటీర్ అప్పట్లో ఉమ్మడి కుటుంబం గా మ్యాపింగ్ చేయటమే దీనికి కారణమైంది. వేరు వేరు కార్డులు ఉన్న వేరువేరుగా నివాసం ఉంటున్న మ్యాపింగ్  విభజన  ఆప్షన్ లేని కారణంగా అన్నదాతలకు చుక్కెదరవుతోంది. తల్లికి వందనం, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది సైత ఒకే కుటుంబంలో నథింగ్ ఉన్నారన్న సాకుతో ప్రభుత్వ పథకాలకు గండిపడుతోంది.
రాష్ట్ర ఆర్థిక మంత్రి, కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ పథకాలు అర్హులకు అందే విధంగా విభజన ఆప్షన్ తెప్పించే విధంగా ఒత్తిడి తేవాలని అన్నదాతలు కోరుతున్నారు.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు