మన న్యూస్, నెల్లూరు ,ఆగస్టు 11 :నెల్లూరు మైపాడు గేటు సెంటర్ దగ్గర శ్రీ భవాని ఫ్యాషన్స్ అండ్ ఇన్నర్ వేర్స్ షోరూం తెలుగుదేశం నాయకులు మామిడాల మధు సోమవారం ఉదయం ప్రారంభించినారు. ఈ సందర్భంగా మావిడాల మధు మాట్లాడుతూ……… శ్రీ భవాని ఫ్యాషన్స్ అండ్ ఇన్నర్ వేర్స్ షోరూం ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు .ఎందుకంటే రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ వల్ల నెల్లూరు నగరం ముఖ్యంగా మైపాడు గేట్ రోడ్డు చాలా అభివృద్ధి చెందుతుంది కనుక ఇక్కడ షోరూం ప్రారంభమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.ఈ షోరూం ప్రొప్రైటర్ కొమ్మతోటి విజయకుమార్ మాట్లాడుతూ….. మా షోరూం ప్రారంభానికి తెలుగుదేశం నాయకులు మామిడాల మధు రావడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. మా షోరూమ్ లో పిల్లలకు పెద్దలు (లేడీస్ అండ్ జెంట్స్) లకు అన్ని రకముల వెరైటీ ఫ్యాషన్స్ తో డ్రెస్సులు లభించును అని తెలిపారు. ఆగస్ట్15, వినాయక చవితి పండుగ సందర్భంగా దుస్తులు కొనుగోలుపై 5 శాతం డిస్కౌంట్ కలదు అని తెలిపారు.నెల్లూరు మైపాడు రోడ్డు ప్రాంత ప్రజలు మా షోరూంకు విచ్చేసి మీకు నచ్చిన దుస్తులు కొనుగోలు చేయగలరని కోరుచున్నాను అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాధవరెడ్డి ,మహేష్, బెల్లంకొండ నరసింహులు, ఋషి, షోరూమ్ అధినేత బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *