

మన న్యూస్: బాధితులకు రక్షణగా ఉంటాం సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయండి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తుఫాను తీవ్రత అధికంగా ఉండడంతో భారీ వర్షం కురుస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచించారు. బాధితులకు రక్షణగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. రెండుమూడు రోజుల పాటు ఈ తుఫాను తీవ్ర ఉంటుందని వాతావరణ శాఖ తెలిపినట్లు చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటునట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అక్కడ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. వర్షం వల్ల ఎటువంటి సమస్య ఎదురైనా సాయం కోసం వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలని విన్నవించారు. కాల్ వచ్చిన వెంటనే సంబంధిత అధికారులు ఆ ప్రాంతాలకు చేరుకుని తక్షణ సాయం అందిస్తారని తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతోపాటు కూటమిలోని బీజేపీ, జనసేన పార్టీ నాయకులు కూడా వర్ష బాధితులకు ఎక్కడికక్కడ సహాయ సహకారాలు అందించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని పిలుపునిచ్చారు. అధికారులంతా కూడా తమ తమ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉండేలా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. తామంతా ఈ వర్షం తీవ్రత నుంచి ప్రజలకు ఎటువంటి సమస్య ఎదురైనా వెంటనే తక్షణ సాయం అందించడానికి సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.