



మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) నాయకపోడు కులస్థులకు తహసీల్దార్ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని దీంతో తమ విద్యార్థుల చదువులకుఆటంకాలుఏర్పడుతున్నాయని నాయకపోడు కులస్థులు రాస్తారోకో చేపట్టారు. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో బుధవారం నాయకపోడు కులుస్థులు765 డీ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మెట్ట పెంటయ్య మాట్లాడుతూ.. తమకు పూర్వం ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారని ఇప్పుడు ఎస్టీలు కాదు బీసీలను తమ కుల ధ్రువీకరణ పత్రాలు నిలిపివేయడం సరికాదన్నారు. గతంలో జీవో నెంబర్ 11 ,21-01-1992, జీవో నెంబర్ 144 ,12-08-1997 కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేవారని గుర్తు చేశారు.దీనివల్ల విద్యార్థులు ఆదర్శ,నవోదయ, గురుకుల పాఠశాలలో ప్రవేశాలుపొందలేకపోతున్నారని మండిపడ్డారు.ధర్నా చేపడుతున్న విషయాన్ని మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి,జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్వయంగా చరవాణిలో మెట్ట పెంటయ్యతో మాట్లాడి
మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం
చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించుకున్నారు.