

(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మినర్వా కళాశాల జూనియర్ మరియు సీనియర్ విభాగ ఎన్సిసి విద్యార్థులు, సామాజిక సేవ మరియు సమాజాభివృద్ధిలో భాగంగా డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డేని పురస్కరించుకుని ప్రత్తిపాడు గ్రామ పురవీధుల్లో ఎయిడ్స్ అవగాహన ర్యాలీని నిర్వహించారు.ఈ ర్యాలీని మినర్వా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జి.హరిబాబు జెండా ఊపి ప్రారంభించారు.ప్రత్తిపాడు మెయిన్ రోడ్డు నందు ర్యాలీ చేసి,అల్లూరి సీతారామరాజు కూడలిలో మానవహారంగా ఏర్పడి ఎయిడ్స్ అనేది అంటూ వ్యాధి కాదు ఇది ఒక అంటించుకునే వ్యాధి మరియు ఎయిడ్స్ కు మందు లేదు నివారణ ఒక్కటే మార్గం అంటూ నినాదాలు చేశారు. సీనియర్ విభాగం ఎన్సిసి అధికారి లెఫ్ట్నెంట్ జి జి సత్యనారాయణ ఎన్సిసి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది ఎన్సీసీ విద్యార్థులు, కళాశాల ఎన్సిసి అధికారులు లెఫ్ట్నెంట్ జి జి సత్యనారాయణ,థర్డ్ ఆఫీసర్ ఎన్ రవికుమార్, లక్ష్మణ్ కుమార్ , తదితరులు పాల్గొన్నారు.