

వనరులు ఉన్నా అవి నిరుపయోగం.
తప్పని పరిస్థితిలో ఉత్తమ వైద్య సేవలకు రిమ్స్ కి కాలిన గాయాల బాధితుడి తరలింపు.
ఉన్నత శ్రేణి 30 పడకల ఆసుపత్రి లేక చికిత్స పొందలేక బాధపడుచున్న తీర ప్రాంత ప్రజలు.
వసతి గృహాం లో రాత్రి పూట మంట వేయడం ఏంటి?
కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన మంత్రి
సంఘటన పై సమగ్ర విచారణకు ఆదేశించిన సంక్షేమ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి.
మన న్యూస్ సింగరాయకొండ:-
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా ఎం ఎల్ హెచ్ పి వంటి వనరులు, వసతులు, సౌకర్యాలు కల్పించినప్పటికీ అవి క్షేత్ర స్థాయిలో సత్ఫలితాలు ఇవ్వడం లేదు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాల నిర్వహణ కొత్త కి వింత పాత కి రోత గా ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం సింగరాయకొండ కూడలి గ్రామ పంచాయతీ పరిధిలో విశాలమైన ప్రాంగణం లో ముప్పై పడకల తో ప్రభుత్వం ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసింది. అయితే గత ప్రభుత్వం హయాం లో కారణాలు ఏమయినా 50 పడకల ఆసుపత్రి గా అభివృద్ధి చెందాల్సి ఉండగా స్థాయిని తగ్గించి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పేరుతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గా తీర్చి దిద్దారు. దానితో ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాస్త పాకల కేంద్రం గానూ, శానం పూడి కేంద్రంగా ఒక ప్రాధమిక ఆరోగ్య కేంద్రం గా ఏర్పాటు చేశారు. పేరుకు మాత్రం రెండు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య ఆరోగ్య సిబ్బంది, వైద్య అధికారులు మాత్రం సింగరాయకొండ లోని ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ప్రస్తుత ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణం నుండే కొనసాగు తున్నాయి. ఇవి కాకుండా 24 గంటలు ప్రజలకు అందుబాటు లో వైద్య ఆరోగ్య సేవలు అందేవిధంగా ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ( ఎం ఎల్ హెచ్ పి) లకు సిబ్బంది, మౌలిక సదుపాయాలు, భవనాలు, వసతులు, వనరులు కల్పించారు. అవి ఎక్కడెక్కడ ఎన్ని సత్ఫలితాలు ఇస్తున్నాయో, ఆ దేవుడికే తెలియాలి. సింగరాయకొండ గ్రామ పంచాయతీ పరిధిలో బంగ్లా రోడ్డు లో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం లో శుక్ర వారం చోటు చేసుకున్న సంఘటన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వివక్షతని గుర్తు చేస్తుంది. సంక్షేమ శాఖ పర్యవేక్షక అధికారులు, సంరక్షకుల, సిబ్బంది బాధ్యతా రాహిత్యం,నిర్లక్ష్యం కళ్లకు కనిపించే విధంగా శుక్రవారం జరిగిన సంఘటన ఉంది. సంక్షేమ బాలుర వసతి గృహం లో 8 వ తరగతి చదివే విద్యార్థి వసతి గృహం ప్రాంగణం లో రాత్రి పూట మంట వేసుకుని వేడి కాచుకునే సందర్భం లో మంటలో పడి ఒళ్ళు కాలినట్లు తోటి విద్యార్థులు చెప్తున్నారు. విద్యార్థులు మంటకి పెట్రోలు వాడినట్లు తెలుస్తుంది. అసలు వసతి గృహం లో కి పెట్రోలు తీసుకు రావడం ఏమిటి? వసతి గృహ సంరక్షకుడు, సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారా? అంటే ఈ సంఘటన అవును అని చెప్తుంది. ప్రమాద వశాత్తూ మంటలలో పడి ఒళ్ళు కాలిన విద్యార్థిని పక్కనే ఎం ఎల్ హెచ్ పి ఉన్నా సేవలు అందుబాటులో ఉన్నాయో లేదో గాని కరెంటు ఆఫీస్ పక్కన ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కి వసతి గృహం సిబ్బంది తో కలిసి ఎం ఆర్ పి ఎస్ నాయకులు కార్యకర్తలు తరలించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో ఆసమయం లో విద్యుత్ అంతరాయం ఉన్నా సెల్ ఫోన్ లైట్లు వేసుకుని ఆరోగ్య సిబ్బంది డా. ధీరేంద్ర, డా ఆయేషా సిబ్బంది ఒళ్ళు కాలిన విద్యార్థికి ప్రాథమిక వైద్య సేవలు అందించారు. ఆరోగ్య కేంద్రం లో బెడ్ లు ఉన్నా, తగిన వ్యవస్త ఉన్నా విద్యుత్ అంతరాయం సమయం లో కనీసం జనరేటర్ కూడా లేక చీకట్లో నే ప్రాధమిక వైద్యం అందించి ఉత్తమ వైద్య సేవల కోసం జిల్లా కేంద్రం లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థి ఉండడం ఈ ప్రాంత ప్రజలకు శాపం గా మారింది. అదే ఇక్కడ 30 పడకల ఆసుపత్రి అందుబాటులో ఉండుంటే స్పెషలిస్ట్ వైద్య అధికారులు, ప్రత్యేక బెడ్ లు, ఇన్ పేషెంట్ వార్డు, ఆపరేషన్ ధియేటర్, ప్రత్యేక అత్యవసర చికిత్స విభాగం ఇతర వసతులు సౌకర్యాలు అందుబాటులో ఉండేవి. 30 పడకల ఉన్నత శ్రేణి ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రం స్థాయి కి ఉపయోగ పడే విధంగవ్ ప్రత్యేక కేంద్రీయ ఆరోగ్య పరీక్షల కేంద్రం( సెంట్రల్ ల్యాబ్) మంజూరు కాగా దాని నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రత్యేక వైద్య సిబ్బంది, వైద్యం అందుబాటులో లేక పోవడం తో ఒళ్ళు కాలిన విద్యార్థిని ఉత్తమ వైద్య సేవల కోసం ఒంగోలు రిమ్స్ కి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి కైన రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి , జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమన్వయంతో చర్చించి తీర ప్రాంత ప్రజలకు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిని 30 పడకలు లేదా 50 పడకల ఆసుపత్రి గా స్థాయి పెంచి అందుబాటులోకి తేవాలని ప్రజల కోరుతున్నారు.

