

గూడూరు, మన న్యూస్ :- నాయుడుపేటలో చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంకు విశేష స్పందన లభించింది*
పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రలయం వారి సహకారంతో నార్త్ రాజుపాలెం లోనే జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణములో ఏర్పాటు చేశామని మేనేజింగ్ ట్రస్టీ చాగణం గౌరిశంకర్, సీఈవో సీతారాం నాయుడు విలేకరుల సమావేశంలో తెలిపారు.
నార్త్ రాజుపాలెం లోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంకు విశేష స్పందన లభించింది. అనంతరం వారు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలకు సీనియర్ వైద్య నిపుణులైన అనుభవం గల స్పెషలిస్ట్ డాక్టర్లు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది అన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరం లో 210 మంది కి పరీక్షలను ఉచితముగా నిర్వహంచి 70 మంది కి ఉచితముగా మందులు పంపిణీ, 60 రోగులకు ఉచిత కంటి అద్దాలు, 50 మంది కి ఉచితంగా ఆపరేషన్ లు చేస్తున్నట్లు తెలిపారు. ఆపరేషన్కు ఎంపిక కాబడిన వారిని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద నేత్రాలయం కి తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించి తిరిగి మళ్లీ వారిని మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు నార్త్ రాజుపాలెం పట్టణంలో వదిలిపెడతారని తెలిపారు. నెల్లూరు తిరుపతి జిల్లాలలోని ప్రతి మండల కేంద్రంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ ఉచిత శిబిరాలను కంటి సమస్యలతో బాధపడేవారు ఉపయోగించుకోవాలని వారు ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎ ఒ కృష్ణ గల్లా, అరవింద్ నేత్రలయ సిబ్బంది వినోద్, దిలీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు కోసం వచ్చిన ప్రజలు కొరకు ట్రస్ట్ వారు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది.
