

మన న్యూస్ సింగరాయకొండ:-
ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సింగరాయకొండ సి.ఐ సి.హెచ్ హజరత్తయ్యకు బుధవారం తన కార్యాలయంలో సాంత్వనా సేవా సంస్థ ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ రావినూతల జయకుమార్ మాట్లాడుతూ. సి.ఐ ఏకగ్రీవంగా ఎన్నికవటం చాలా సంతోషంగా ఉందన్నారు.అదేవిధంగా బాల్యవివాహాలు,బాల కార్మికులు, బాలల అక్రమ రవాణా, బండెడ్ చైల్డ్ లేబర్స్ ను అరికట్టడంలో సి. ఐ విశేష కృషి చేశారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల స్వచ్ఛభారత్ కోఆర్డినేటర్ చిమట సుధాకర్ , డొక్కా కిషోర్, యం రాజారాం, పొనుగోటి లాజర్ మరియు సాంత్వనా సేవా సమితి
సిబ్బంది పాల్గొన్నారు