

సీనియర్ సివిల్ జడ్జి ఎం.శోభ
మన న్యూస్ సింగరాయకొండ:-
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉన్న కోర్టు పరిధిలలో మధ్యవర్తిత్వం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు కందుకూరు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కందుకూరు కోర్టు ప్రాంగణం నుండి పోస్ట్ ఆఫీస్ వరకు మధ్యవర్తిత్వం పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీనియర్ సివిల్ జడ్జి ఎం.శోభ ఈ సందర్భంగా మాట్లాడుతూ సివిల్ మరియు క్రిమినల్ కేసులలో రాజీ పడదగిన వివాదాలపైకక్షిధారులు మధ్యవర్తిత్వం, లోక్ అదాలత్ ద్వారా కేసులుపరిష్కరించుకోవచ్చుననితెలియపరిచారు.కార్యక్రమంలో కందుకూర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి శ్రీధర్ నాయుడు మరియు న్యాయవాదులు పాల్గొన్నారు.
