

ఉరవకొండ మన న్యూస్:శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము ఆంధ్రా కోస్తాలో రాజధాని అన్నా ఉండాలి.లేదా ఆంధ్రా ప్రధాన హైకోర్టు అన్నా ఉండాలి. రాయలసీమ ప్రాంతం కర్నూల్ లో రాజధాని అన్నా ఉండాలి లేదా ఆంధ్రా ప్రధాన హైకోర్టు అన్నా ఉండాలి కదా? రాయలసీమ ప్రాంత కర్నూలు లో రాజధాని పెట్టలేదు. ఆంధ్రా ప్రధాన హైకోర్టు పెట్టలేదు. 2014 రాష్ట్ర విభజన అయిన తర్వాత మన రాయలసీమ ప్రాంత పాలక వర్గాలు రాయాల సీమకు మొండి చెయ్యి చూపినారు. మన కర్నూల్ జిల్లా బారు 16-11-1937 శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారము రాయలసీమ కర్నూలులో ప్రధాన హైకోర్టు పెట్టాలని చాలా సుధీర్ఘ ఉద్యమం
చేసినాము. మన రాయలసీమ ఆంధ్రా హైకోర్టు కర్నూలు లో పెట్టాలనే డిమాండును ఆంధ్రా హైకోర్టు బెంచ్ డిమాండు చాలు అని దిగజార్చినారు. అది అన్నా సాధిస్తర అంటే అది లేదు. మనం
పోరాటం చేయనిదే మన రాయలసీమ ప్రాంత కర్నూలుకు
ఆంధ్రా హైకోర్టు బెంచ్ కాదుగదా
ఆంధ్రా హైకోర్టు స్టూల్ కూడా రాదు.అంతే కాదు ఈ రోజు నేను
ఆంధ్రా మధ్య కోస్తా అమరావతి కి
వచ్చి చూచినది ఏమంటే.ఆంధ్రా
మధ్యకొస్తా విజయవాడ నడి నగరములో ముడూ కాల్వలు లలో నీరుచాలా సమృద్ధిగా పారుచున్నవి. యీ కాలువ లకు
మన కే.సి.కాల్వలు మూడు కావాలి. అంత వెడెల్పు,భయంకర
లోతు భీతి కొల్పే లోతులో నీరు
పారు తున్నవి యీ రోజు మన కర్నూలు కే.సి.కాల్వలో ఈరోజు కి
మురుగు నీరు ప్రవహిస్తున్నది.
తుంగ భద్రా నది కృష్ణా నది ల
ప్రవాహం మన రాయలసీమ & తెలంగాణలో ప్రవహించి చున్నవి.
చరిత్రలో పై వాడు నీళ్లు సమృద్ధిగా తాగాలి. చిత్రం ఏమంటే మన రాయలసీమ ప్రాంత మోచేతి క్రిందా ఉన్న ప్రాంతం ఆంధ్రా మధ్య కోస్తా ప్రాంతం లో కాలువలు నేడు యీ రోజుకి పొంగి ప్రవహిస్తున్నాయి.
వేదవతి,ప్రాజెక్ట్, గుండ్రెవుల ప్రాజెక్ట్, సిద్ధేశ్వరము అలుగు ప్రాజెక్ట్ చాలా తక్కువ బడ్జెట్ తో
నిర్మించవచ్చు.కానీ రాయలసీమ పాలక వర్గాలు యీ పని చెయ్యవు. రాయలసీమ ను ఎండ బెట్టి కానీ, సీమ ప్రజలు ఏమయినా పర్వాలేదు. నాశనం అయిన పర్వాలేదు రాయలసీమ రైతాంగం. రాయలసీమ పాలక వర్గాలు సిగ్గు విడిచి ఆంధ్రా కోస్తా పనికట్టుకుని,పోటీపడి అధికారం కోసం ఆంధ్రా కొస్తను అభివృద్ధి చేస్తారు. ఈ రోజు నేను ఆంధ్రా మధ్య దక్షిణ కోస్తా లో పర్యటించి యధార్థ ఘటన లను లాయర్ కృష్ణ మూర్తి వివరించారు.