

మన న్యూస్ తవణంపల్లె జులై-15
తవణంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారి ప్రియాంక ఆధ్వర్యంలో క్షయ వ్యాధిని నిర్మూలిద్దాం టిబి ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక జనాభా కింద 60 సంవత్సరాల పైబడిన వారు చక్కర వ్యాధిగ్రస్తులు పొగ మందు తాగే అలవాటు ఉన్నవారు క్షయ వ్యాధి బాధితుని ఇంటిలో సభ్యులకు డిజిటల్ మరియు ఎక్స్రే ద్వారా 150 మందికి లో 15 మంది అనుమానితులను గళ్ళ పరీక్ష కేంద్రంలో రక్త పరీక్ష చేసి ఫలితం చెప్పబడునని తెలిపారు. ఎవరికైనా రెండు వారాల పైబడి దగ్గు జ్వరము ఆకలి లేకపోవడం ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే ఎక్స్రే గళ్ళ పరీక్ష చేసుకొని ప్రభుత్వం అందించే మందులను 6 నెలలు వాడితే టీబీ పూర్తిగా వ్యాధి నయమవుతుందని, ప్రభుత్వం నెలకు ₹1000 రూపాయలు చొప్పున వ్యాధి చోకినవారికి 6 నెలలు డిబిట్ జమ చేయుదురని వైద్యాధికారి ప్రియాంక తెలిపారు. ఈ కార్యక్రమంలో టిబి సూపర్వైజర్ శివకుమార్, సిహెచ్ఓ జ్ఞాన శేఖర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.