

ఉరవకొండ, మన న్యూస్:వ్యాసాపురం, గ్రామానికి చెందిన టీడీపీ, సీనియర్ నాయకుడు కొంకా పర్వతప్ప (96) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మాజీ సర్పంచు, టీడీపీ సీనియర్ నాయకుడు కొంకా సీతారాములు తండ్రి.పర్వతప్ప గారు గ్రామానికి సామాజిక సేవలో విస్తృత సేవలందించారు. ఈ రోజు ఆయన అంత్యక్రియలు స్వగ్రామమైన వ్యాసాపురంలో నిర్వహించనున్నారు. శ్రీ కొంకా పర్వతప్ప మృతిపట్ల సీనియర్ పాత్రికేయులు, కాకతీయ సేవా సమితి తాలూకా అధ్యక్షులు మాలపాటి శ్రీనివాసులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.