మన న్యూస్ బంగారుపాళ్యం జులై-14
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి పూతలపట్టు నియోజకవర్గంలో ప్రజల నుండి విశేష స్పందన వస్తోంది. సోమవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బంగారుపాళ్యం మండలం, టేకుమంద పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్”* పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి బంగారుపాళ్యం మండల నాయకులు పూలమాలలు, దుశ్శాలువతో సత్కరించగా, మహిళలు కర్పూర నీరాజనాలు అందిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించి, టిడిపి జెండాను ఆవిష్కరించారు. తర్వాత మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి ప్రజల యోగ క్షేమాలు తెలుసుకుని ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అందించిన అభివృద్ధి, సంక్షేమ పధకాలను వివరిస్తూ, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియజేస్తూ.. సంక్షేమ, అభివృద్ధి పధాకాలకు సంబంధించిన కరపత్రాలను పంచుతూ ముందుకు సాగారు. అనంతరం స్థానిక ప్రజలతో సమావేశమై ఎమ్మెల్యే సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ.. మరి కొన్నింటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వృద్దాప్య, వితంతువు, ఒంటరి మహిళలు, కిడ్నీ భాధితులు, ప్రత్యేక ప్రతిభావంతులకు సకాలంలో ఫింఛన్ ను అందజేస్తున్నారా లేదా.. కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది అనే దానిపై ఆరా తీశారు. దీనిపై ప్రజలు, లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చుతూ సుపరిపాలనలో తొలి అడుగును పూర్తి చేసుకుందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో గ్రామాల్లో ఒక్క అభివృద్ధి కూడా నోచుకోలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పని చేస్తూ గ్రామాల్లో అవసరమైన మౌళిక సదుపాయాలను సమకూర్చుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనాదక్షతను చూసి రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్తున్న నాయకులకు ప్రజలు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బంగారుపాళ్యం మండల అధ్యక్షులు ఎన్.పి.ధరణీ నాయుడు, బంగారుపాళ్యం మార్కెట్ కమిటీ ఛైర్మెన్ భాస్కర్ నాయుడు, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎన్.పి.జయచంద్ర నాయుడు, చిత్తూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కోక ప్రకాష్, మండల ప్రధాన కార్యదర్శి జనార్థన్ గౌడ్ మరియు మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

