నంది గుంటలో సుపరిపాలనలో తొలి అడుగు..!ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్, అడుగు అడుగున జననీరాజనాలు..!

వింజమూరు, మనన్యూస్::వింజమూరు మండలం నంది గుంట పంచాయతీ లో మంగళవారం రాత్రి జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం లో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
వింజమూరు మండలం తెలుగుదేశం నాయకత్వంలో నంది గుంట గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు నీరాజనాలు పలికారు. ఇంటింటికి తిరుగుతూ సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడుగుతూ, ఇంటింటికి తిరిగారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటికి పరిష్కారం మార్గాలను చూపారు. మహిళలు స్వాగతం పలికి, మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం లో అభివృద్ధి సంక్షేమ పథకాలకు కొదవలేదు, అన్ని పథకాలు అందుతున్నాయి అంటూ, ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకుడు మంత్రి శ్రీ నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి సారథ్యంలో ఉదయగిరి సిరుల గిరిగా అభివృద్ధి చెందుతుంది అని చెందుతుందని ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు, క్లస్టర్ , యూనిట్ ఇంచార్జీలు, బూత్ కన్వీనర్ల సారధ్యంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు గంగ పట్ల వెంగయ్య, ఎంపీటీసీ సభ్యులు బసిరెడ్డి సుమలత, బసిరెడ్డి జయంత్ రెడ్డిల ఆధ్వర్యంలో మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎల్సీ రమణారెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి, మంచాల శ్రీనివాసులు నాయుడు, కోడూరు నాగిరెడ్డి, కొండపల్లి వెంకటేశ్వర్లు నాయుడు, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పులిచెర్ల నారాయణరెడ్డి, బిజెపి మండల కన్వీనర్ డేగ మధు యాదవ్, పాములపాటి మాల్యాద్రి, వై పెంచలరావు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

    మన న్యూస్: రాయదుర్గం నియోజకవర్గం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 11న (శుక్రవారం) మధ్యాహ్నం 2:00 గంటలకు ఉడేగోళం మద్దినేశ్వర స్వామి కళ్యాణ మండపంలో సర్వసభ్య విస్తృత సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ…

    కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

    ఉరవకొండ, మన న్యూస్:నాలుగు కోడ్ లను నిరసిస్తూ వివిధ సంఘా ల నేతలు ర్యాలీ చేసాయిఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ వి నాయుడు అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఎల్పర్స్ యూనియన్ నాయకులు హమాలీ యూనియన్ నాయకులు పంచాయతీ కార్మికులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    బాల్యంలో గర్భధారణ నివారిద్దాం : వైద్య అధికారి సర్దార్ వలి

    బాల్యంలో గర్భధారణ నివారిద్దాం : వైద్య అధికారి సర్దార్ వలి

    రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

    రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

    జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్

    జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్

    కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

    కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

    అన్ని పాపాలకు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోడీ.-స్మార్ట్ మీటర్ల బిగింపు పై అందరిదీ ఒకటే దారి: సిపిఎం విరుపాక్షి.

    అన్ని పాపాలకు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోడీ.-స్మార్ట్ మీటర్ల బిగింపు పై అందరిదీ ఒకటే దారి: సిపిఎం విరుపాక్షి.

    మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ కు ఘన స్వాగతం పలికిన ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు..!!

    మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ కు ఘన స్వాగతం పలికిన ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు..!!