ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీతో పేదల జీవితాల్లో వెలుగు – మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి , జీడి నెల్లూరు ఇన్చార్జి కృపా లక్ష్మి

విద్యార్థులు యువత పట్ల దైవం వైయస్‌ఆర్‌

మన న్యూస్, ఎస్ఆర్ పురం:- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి యువత విద్యార్థుల పట్ల దైవం అని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, జీడి నెల్లూరు ఇన్చార్జి కృపా లక్ష్మి అన్నారు. వైఎస్‌ఆర్‌ భౌతికంగా లేకపోయినా అందరి హృదయాల్లో బతికే ఉన్నారని తెలిపారు. మంగళవారం గంగాధర నెల్లూరులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , యువజన విభాగం ఆధ్వర్యంలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా నియోజవర్గ ఇంచార్జ్ కృపాలక్ష్మితో కలిసి వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం వైసీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్ రెడ్డి,నియోజకవర్గ అధ్యక్షులు కిశోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నారాయణ స్వామి, కృపా లక్ష్మి ప్రారంభించారు. 76 మంది యువకులు రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా నారాయణ స్వామి,కృపాలక్ష్మి మాట్లాడుతూ యువజన విభాగం నాయకులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితోనే వైఎస్‌ జగన్‌ ఐదేళ్ల పాలన సాగిందని తెలిపారు. వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక పేదరికాన్ని పొగొట్టడానికి అనేక చర్యలు తీసుకున్నారన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో కరువును పారదోలడానికి జలయజ్ఞం ద్వారా 86 ప్రాజెక్టులకు రూపకల్పన చేశారన్నారు. ఈ రోజు రాయలసీమకు కృష్ణా జలాలు వస్తున్నాయంటే అది వైఎస్‌ రాజశేఖరరెడ్డి చలవతోనేనని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకొచ్చి పనులు ప్రారంభించిన ఘనత కూడా వైఎస్‌ఆర్‌దేనని తెలిపారు.యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు విద్యను చేరువ చేయడానికి రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తెచ్చారని గుర్తు చేశారు. దీని వల్ల వేలాది మంది ఉన్నత విద్యను అభ్యసించారన్నారు.

అదేవిధంగా పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్‌ వైద్యాన్ని అందించారని తెలిపారు. 108.. 104 వాహనాలను తెచ్చిన ఘనత కూడా వైఎస్‌ఆర్‌దేనని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ అందించారన్నారు. వడ్డీ వ్యాపారస్తులు పీల్చిపిప్పి చేస్తుంటే మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు అందించిన ఘనత వైఎస్‌దని తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించి వారి సొంతింటి కలను సాకారం చేశారన్నారు. పరిపాలకుడు అంటే ఎలా ఉండాలో తెలియజేసిన నాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని కీర్తించారు. తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన తనయుడిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ఐదేళ్ల పాలనలో రెండు అడుగులు ముందుకు వేసి సంక్షేమ పథకాలు అందించినట్లు చెప్పారు. వైఎస్‌ స్ఫూర్తితో ఆయన ఆశయ సాధన కోసం పని చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, వెంకటరెడ్డి , మాజీ సి డి సి ఎం ఎస్ చైర్మన్ వేల్కూరు బాబురెడ్డి, సీనియర్ నాయకులు గుణశేఖర్ రెడ్డి, ముని రాజారెడ్డి, డిసి మనోజ్ రెడ్డి, చంద్రశేఖర్, కిషోర్,దొరబాబు, ఆర్టిఏ అధ్యక్షులు ఢిల్లీ కుమార్, యువజన విభాగం నాయకులు గణపతి,జ్ఞానేంద్ర, బాబు, జగదీష్,గోపి,శబరీష్ తదితరులు పాల్గొన్నారు.

వైయస్ఆర్ యువజన విభాగం ఆధ్వర్యంలో మహానేత వైఎస్‌ఆర్‌కు ఘన నివాళి, రక్తదానం చేసిన 76 మంది యువకులు

  • Related Posts

    నేలతల్లి ఆరోగ్యమే మన ఆరోగ్యం

    పాచిపెంట,,మన న్యూస్ , జూలై 9:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోపంటలు పండించే భూమి ఆరోగ్యంగా ఉంటే ఆ పంటలు తినే మనుషులు ఆరోగ్యంగా ఉంటారని పాంచాలి సర్పంచ్ గూడెపు యుగంధర్ అన్నారు. బుధవారం నాడు మండలం పాంచాలి గ్రామంలో…

    పంచాయతీల పురోగతి పై శిక్షణ

    మన న్యూస్ పాచిపెంట, జూలై 9:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట పంచాయితీలు అభివృద్ధి, పురోగతి సూచిక పై పంచాయితీ కార్యదర్శులు కి ఇంజనీరింగ్ సహాయకులకి డిజిటల్ సహాయకులకి మండల స్థాయి అధికారులకి ఒకరోజు శిక్షణ ఇవ్వడం జరిగిందని పాచిపెంట ఎంపీడీవో బి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేలతల్లి ఆరోగ్యమే మన ఆరోగ్యం

    నేలతల్లి  ఆరోగ్యమే మన ఆరోగ్యం

    పంచాయతీల పురోగతి పై శిక్షణ

    పంచాయతీల పురోగతి పై శిక్షణ

    వ్యాపారి ఇందూరి నాగభూషణరావు ఆత్మహత్య…

    వ్యాపారి ఇందూరి నాగభూషణరావు ఆత్మహత్య…

    దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె

    దేశవ్యాప్తంగా  సార్వత్రిక   సమ్మె

    రాష్ట్రస్థాయి విజేతలకు బహుమతులు అందజేసిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్..

    రాష్ట్రస్థాయి విజేతలకు బహుమతులు అందజేసిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్..

    జే.వివి. ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు భోజనాలు పంపిణీ….

    జే.వివి. ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు భోజనాలు పంపిణీ….