కొండాపురం మండలం రెడ్ క్రాస్ కన్వీనర్ తాటికొండ నవీన్ 54వ సారి రక్తదానం..!!!

కావలిమనన్యూస్ : సాయిపేట మాజీ సర్పంచ్, భీమవరప్పాడు మాజీ PACS అధ్యక్షులు, నెల్లూరు జిల్లా టెలికాం సలహా సభ్యులు, INC కొండాపురం మండలం మాజీ కన్వీనర్
తాటికొండ రామమూర్తి 4వ వర్ధంతి సందర్బంగా వారి కుమారుడు కొండాపురం మండలం రెడ్‌క్రాస్ కన్వీనర్ మరియు లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తాటికొండ నవీన్ కావలి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నందు 54 వ సారి రక్తదానం చేసారు. ఈ సందర్బంగా కావలి రెడ్ క్రాస్ చైర్మన్ రవిప్రకాష్ మాట్లాడుతు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో రక్తం అవసరమైన వారికి రక్తదాతలను ఎర్పాటుచేస్థూ ప్రాణాలను కాపాడుతున్నాడని అన్నారు.ఈ రోజు వారి నాన్న గారి 4వ వర్ధంతి సందర్బంగా 54వ సారి రక్తదానం చేయటం అభినందనీయం అని అన్నారు. తాటికొండ నవీన్ మాట్లాడుతు మా నాన్న గారి స్పూర్తితో లైఫ్ లైన్ ఫౌండేషన్ స్థాపించి మా నాన్న గారి ఆధ్వర్యం లో అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించాము. ప్రతి సంవత్సరం మా నాన్న గారి వర్ధంతి సందర్భంగా వివిధ సేవాకార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రోజు మా నాన్న గారి 4వ వర్ధంతి సందర్బంగా కావలి రెడ్ క్రాస్ నందు రక్తదానం చేసానని అన్నారు. ఈ కార్యక్రమలలో జయ ఉష స్కూల్ కరస్పాండెంట్ వెంకట్రావు మరియు రెడ్‌క్రాస్ సిబ్బంధి పాల్గొన్నారు

  • Related Posts

    మండలంలో విద్యార్థులతో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు…

    శంఖవరం మన న్యూస్ ప్రతినిధి;- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలోని మండల ప్రజా పరిషత్తు ప్రాధమిక పాఠశాలలు, మండల‌ పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాలలు, గిరిజన సంక్షేమ ప్రాధమిక పాఠశాలు, జిల్లా ప్రజా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, గిరిజన సంక్షేమ…

    ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

    _ రెఫరల్ చైర్మన్ స్లెస్సర్ బాబు శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- విద్యార్థులకు ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని అని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సీతయ్యమ్మపేట రూరల్ ఇండియా సెల్ఫ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఛైర్మన్, రెఫరల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.

    దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.

    మండలంలో విద్యార్థులతో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు…

    మండలంలో విద్యార్థులతో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు…

    ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

    ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

    భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

    భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

    గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ముద్రగడ

    గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ముద్రగడ

    చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

    చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!