కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి-సర్వేయర్ తేజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

సర్వేయర్ తేజేశ్వర్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలి

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 27 :జోగులాంబ గద్వాల జిల్లా జిల్లాలో కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరినట్లు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వెల్లడించారు. జిల్లా కేంద్రం గంటవీధిలో గల ఇటీవల హత్యకు గురైన తేజేశ్వర్ కుటుంబ సభ్యులను పమర్శించారు. ఎమ్మెల్యే తేజేశ్వర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా కేంద్రానికి చెందిన తేజేశ్వర్ హత్య బాధాకరమన్నారు. ఇటీవల పాతపాలెం లో ఇదే తరహాలో హత్య చేయబడిందన్నారు. ఇలాంటి కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులే పరిష్కారం అన్నారు. ఇటువంటి నేరాలకు పాల్పడిన నిందితులను ఆరు నెలల్లోపు శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల నిందితులకు శిక్ష పడడం వల్ల బాధితులకు న్యాయం జరిగినట్లు అవుతుందన్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వ పరువు తీసే విధంగా ఉన్నాయని, జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఫాస్ట్గా కోర్టు ఏర్పాటు చేయడమే మంచిదన్నారు దీని ద్వారా తప్పు చేసిన వారికి త్వరగా శిక్షలు పడే అవకాశం ఉందన్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. కేసును త్వరితగతిన చేదించిన పోలీసులను ఎమ్మెల్యే అభినందించారు. నిందితులకు త్వరగా శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు .ఈ సమావేశంలో మాజీ జడ్పీ చైర్మన్ బండారు భాస్కర్ , జిల్లా సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, మాజీ కౌన్సిలర్స్ మురళి, కృష్ణ మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి రాజశేఖర్, ఆలయం కమిటీ డైరెక్టర్ వెంకటేష్, నాయకులు గోవిందు కురుమన్న, ధర్మ నాయుడు కొత్త గణేష్, షాషా జయరాములు, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///