వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని గంటవారిపల్లి పంచాయతీకి చెందిన ముఠాలం గ్రామంలో గత కొద్ది రోజులుగా తాగునీరు సమస్య ఉండడంతో స్థానిక సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కు ముఠాలం గ్రామంలో నీటి సమస్య ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందిస్తూ జడ్పీనిధుల ద్వారా తాగునీరు బోరును మంజూరు చేయడం జరిగింది.ఆదివారం రాత్రి ముఠాలం గ్రామంలో తాగునీరు బోరు వేయడం జరిగింది. అందులో నీరు పుష్కలంగా రావడంతో గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కు, సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి, మాజీ సర్పంచ్ లకు, స్థానిక టిడిపి నాయకులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *