సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల భాగస్వామ్యం పాఠశాలల నిర్వహణ పై ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకుంటూ పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం సంకల్పించిన విద్యా కమిటీల ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలను తలపిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన విద్యా కమిటి ఎన్నిక నిర్వహణ కొరకు ఏర్పాటు చేసిన ప్రక్రియలో ఆ పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు చైర్మన్, పాలక వర్గాన్ని ఎన్నుకుంటారు. ఎన్నికలు జరిగే ప్రదేశానికి ఏ రాజకీయ పార్టీ దారులను పోనివ్వకుండా సింగరాయకొండ ఎస్ ఐ లేళ్ల సుధీర్ కుమార్ స్వయంగా రంగంలో కి దిగి శాంతి భద్రతలు పర్యవేక్షించారు
ఎటువంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పరిరక్షణ కొరకు పోలింగ్ జరిగే ప్రాతం లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. ఎట్టకేలకు ఎన్నిక ఏకపక్షం కావడం జరిగింది చైర్మన్ గా కోడూరి వెంకటరావు వైస్ చైర్మన్ బాలదుర్గ లు ను ఎన్నుకున్నారు. నూతన కమిటీని టిడిపి శ్రేణులు సత్కరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *