ఏర్పేడు అక్టోబర్మ 3. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు, ఎర్పేడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు సహకారంతో మండల పరిధిలోని ముసలిపేడు గ్రామంలో శుక్రవారం పారిశుద్ధ్య పనులను ఘనంగా చేపట్టారు.
గ్రామంలో ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో బూత్ ఇంచార్జ్ వై. మనోహర్ నాయుడు మరియు పంచాయతీ సెక్రటరీ స్వయంగా ఈ పనులను పర్యవేక్షించారు. గ్రామంలోని వీధులు, మురుగు నీటి కాలువలను క్షుణ్ణంగా పరిశీలించిన నాయకులు మరియు అధికారులు, తక్షణమే వ్యర్థాల తొలగింపు చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా బూత్ ఇంచార్జ్ వై. మనోహర్ నాయుడు మరియు పంచాయతీ సెక్రటరీ మాట్లాడుతూ… గ్రామంలో ప్రజలకు ఎలాంటి అంటువ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఈ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో గ్రామంలోని డ్రైనేజీలన్నింటినీ పూర్తిగా క్లీనింగ్ చేసి, మురుగు నీటి సమస్య లేకుండా చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ ముఖ్య ఉద్దేశమని వారు స్పష్టం చేశారు. గ్రామ సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు మరియు పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.
