- జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్….

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం సెప్టెంబర్28:36వ వార్డులో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో భారీగా చేరికలు జనసేన పార్టీ విధానాలు,పార్టీ అధినేత,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంపై విశ్వాసంతో విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 36వ వార్డుకు చెందిన పలువురు వైసీపీ నుంచి ముస్లిం సోదర సోదరీమణులు,పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీలో చేరారు.36వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు పి. శ్రీనివాస్ గౌడ్,36వ వార్డు ముస్లిం మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ షారుఖ్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో నూతనంగా పార్టీలో చేరిన వారికి జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా మహమ్మద్ ముస్తాక్,అబ్దుల్ సలాం,ఎం.డి. ఆరిజి,ఎం.డి.ఫౌజర్,ఎస్.లక్ష్మి,జి.జ్యోతి,ఎస్.కె. షబానా,ఎం.డి.నసీమ,ఆర్.నారాయణరావు,వెంకట రమణ తదితరులు జనసేన పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ,ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్‌చార్జి పి.వి.శివప్రసాద్ రెడ్డి,36వ వార్డు జనసేన పార్టీ సీనియర్ నాయకులు జెర్రీ పోతుల ప్రసాద్, 36వ వార్డు జనసేన పార్టీ నాయకులు,యువత,జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.