నకిలీ పత్తి విత్తనాల సమస్య పైన తెలంగాణ వ్యవసాయ &రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు – పాల్గొన్న ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఎ సంపత్ కుమార్

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 23 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా నుంచి ఇద్దరు వ్యవసాయ అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. నకిలీ పత్తి విత్తనాలు మరియు రైతు సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకుడు.ఆరోజు శాసన సభ్యుడుగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు రైతుల కోసం అహర్నిశలు ఆలోచన చేసే నాయకుడు సంపత్ కుమార్ అని వ్యాఖ్యానించిన రైతు&వ్యవసాయ సంక్షేమ శాఖ చైర్మెన్ కోదండ రెడ్డి . ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ .
ఒక ఆడ విత్తనం మరియు మరొక మగ విత్తనం రెండు కలిపి సంపర్కం చేసిన తర్వాత వచ్చే ఫలితమే విత్తనం అని ఆ విత్తనాన్ని జీఓటి టెస్టు పేరుతో కంపెనీలు అనధికారిక ల్యాబుల్లో టెస్టులు చేయించి ఈ విత్తనం టెస్ట్ పాస్ అవలేదు అని చెప్పడంతో రైతు గుండెపోటుతో చనిపోతున్నారు అని అన్నారు .
ఒక ల్యాబులో టెస్ట్ చేయిస్తే 85% వచ్చిన విత్తనం క్వాలిటీ మరొక ల్యాబులో చేయిస్తే 95%ఎలా వస్తుంది.రైతులను చేసే మోసం అంతా కూడా కేవలం ల్యాబుల వద్ద జీఓటి టెస్టు పేరుతో జరుగుతుంది అని అన్నారు.అంతేకాకుండా రైతు అమాయకుడు అని పంచభూతాలను నమ్మి విత్తనం ,నమ్మకం భూమిలో పెట్టీ కష్టపడటం రైతు పని అని ఆ నమ్మకం కష్టం వృథా కావడంతో రైతు కళ్ళల్లో నీరు కాకుండా రక్తం కారుతుంది అన్నారు.గత ప్రభుత్వాలు ఎలా ఉన్నప్పటికీ యిది ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కనుక రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు అన్నారు .కంపెనీలు ప్రొఫెషన్ గా పిలుచుకునే. ఆర్గనైజర్ రైతు వద్ద విత్తనాల ల్యాబ్ టెస్ట్ లు సమయం వృధా చేసి అప్పులు తెచ్చిన డబ్బులకు అధిక మొత్తం లో వడ్డీలు వసూలు చేస్తున్నారు అని అన్నారు.
మరియు ఫెయిల్ అయిన విత్తనాలు తిరిగి ఎందుకు రైతులకు అందచేయడం లేదు అని ,ఆ ఫెయిల్ అయిన విత్తనాలను వేరే లోకల్ కంపెనీల పేరుతో అమ్మకం చేసి మద్యలో ఉన్న బ్రోకర్లు సొమ్ము చేసుకుని రైతు నోట్లో మట్టి కొడుతున్నారు అన్నారు.గతంలో కావేరి సీడ్స్ అనే కంపెనీ పైన రైతుల పక్షాన పోరాటం చేసినందుకు 75 రోజుల పాటు జైలుకి వెళ్లినప్పటికీ రైతులకోసం పోరాటం చేయడం ఏ మాత్రం వెనక్కు తగ్గను అని సంపత్ కుమార్ అన్నారు.రైతుల పట్ల సంపత్ కుమార్ ఉన్న ప్రేమ ,చిత్తశుద్ధి ,నీ చూసి కమిషన్ సభ్యులు సంపత్ కుమార్ ని అభినందించారు. కంపెనీలు ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి నేరుగా రైతుల నుంచి సమస్యలు , సూచనలు సేకరించాలని సంపత్ కుమార్ తెలిపారు.నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించే దిశగా కృషి చేసి రైతుల కళ్ళల్లో ఆనందం నింపే దిశగా కృషి చేయాలని సంపత్ కుమార్ అన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ కమిషన్ చైర్మెన్ కోదండ రెడ్డి ,సభ్యులు భవానీ రెడ్డి,KVN రెడ్డి, శ్రీ రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి ,రాములు నాయక్ వివిధ పత్తి విత్తన కంపెనీల ప్రతినిధులు,గద్వాల జిల్లా వ్యవసాయ అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు