మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి,మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా:మక్తల్ మండల కేంద్రంలోని స్కాలర్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కార్యక్రమన్ని మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రాన్ని మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు యాంటీనార్కటిక్ బ్యూరో వింగ్ వారి ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జూన్ 26న యాంటీ డ్రగ్ దినోత్సవం పురస్కరించుకొని 26వ తేది వరకు మత్తు పదార్థాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.మాదకద్రవ్యాలకు విద్యార్థులు, ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు ముందుకు సాగాలన్నారు. యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడడం వలన క్రమేపి ఆరోగ్యం క్షీణించడంతో పాటు అది ఒక వ్యసనంగా మారుతుందని అన్నారు.నేర ప్రవృత్తి వైపు దారితీస్తుందన్న ఈ విషయన్ని గమనించాలని పేర్కొన్నారు. తద్వారా కుటుంబ సభ్యుల సత్సంబంధాలుకు దూరమవుతారని అన్నారు. చెడు అలవాట్లకు బానిసై, యువత చెడిపోవద్దని ఆయన సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా దాని నుండి ఆదిలోనే తుంచి వేయాలని కోరారు. ఎవరైనా నిషేధిత మాదక ద్రవ్యాల యొక్క సమాచారాని తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచి అట్టి వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. డ్రగ్స్ సమాచారం తెలిస్తే సెల్ నెం. టీ జీ ఏ ఎన్ జీ టోల్ ఫ్రీ నెంబర్ 1908 లేదా 8712671111 కి సమాచారం ఇవ్వాలని తెలిపారు. డ్రగ్స్, గంజాయి, కోకెన్ లాంటి మత్తు పదార్థాలు విక్రయించిన వారికి కఠిన శిక్షలు తప్పవు అని ఎస్ ఐ తెలిపారు.ఈ కార్యక్రమంలో మక్తల్ పోలీసులు, లెక్చరర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో జరిగిన పోషణ మాసం మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం…

పేదోడి సొంతింటి కల నెరవేరింది..

మనధ్యాస,నిజాంసాగర్(జుక్కల్): సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుతో పేదోడి సొంతింటి కల నిజమవుతుందని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. సోమవారం సుల్తాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటికి ప్రారంభోత్సవం నిర్వహించారు.ఇందిరమ్మ పథకం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?