​ రేణిగుంట అక్టోబర్ 4.

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు, రేణిగుంట ఎస్‌డీపీఓ శ్రీనివాసరావు పర్యవేక్షణలో గాజులమండ్యం పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లకు శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. రేణిగుంట మండలం గాజులమండ్యం పిఎస్ సీఐ మంజునాథరెడ్డి, ఎస్సై హరీష మరియు పోలీస్ సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

​ఈ సందర్భంగా సీఐ మంజునాథరెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడకూడదని రౌడీ షీటర్లకు స్పష్టం చేశారు. ఎటువంటి నేరాలకు దూరంగా ఉంటూ, చట్టాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని సూచించారు.

​ప్రజలకు భయభ్రాంతులు కలిగించినా లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా చట్టప్రకారం తీవ్ర పరిణామాలు ఉంటాయని, కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *