కూటమి పాలనలో అభివృద్ధి ,సంక్షేమంతో ముందుకు సాగుతాం…. సూళ్లూరుపేట మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం

మన న్యూస్ ,సూళ్లూరుపేట:*కూటమి ప్రభుత్వ ఏడాది విజయోత్సవ సభలో సూళ్లూరుపేట నియోజకవర్గం సమన్వయకర్త.*పాలనలో సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ బాబు ఆలోచనలు భేష్.*పాలనలో కార్యకర్తలకు పెద్దపీట *ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ముందుంటాం.కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి పాలనను కొనసాగిస్తుందని మాజీ పార్లమెంటు సభ్యులు నెలవల సుబ్రమణ్యం పేర్కొన్నారు.గురువారం కూటమి ప్రభుత్వ తొలి ఏడాది విజయోత్సవ సభ తెలుగు దేశం పార్టీ కార్యలయంలొ నెలవల సుబ్రమణ్యం సమక్షంలో జరిగింది.ఈ సభలో కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నేటికి (అనగా జూన్ 12 నాటికి) కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా నియోజకవర్గ స్థాయి విజయోత్సవ సభను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.కూటమి ప్రభుత్వం లొ నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో, లోకేష్ చాకచక్యంతో ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలను ప్రభుత్వం అమలు చేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటుందన్నారు.మరో ముఖ్యమైన పథకం తల్లికి వందనం నేటి నుండి అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఈ పథకం ద్వారా 67,27,164 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లు నగదును ప్రభుత్వం జమ చేస్తోందన్నారు.అలాగే ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు, ఆపై అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఏటా రూ.20 వేలు నగదు జమ, పేదలకు ఇంటి పట్టాలు, ఇల్లు నిర్మాణం చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా చేపట్టడం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తారు రోడ్లు, సీసీ రోడ్లు, పశువుల షెడ్లు, తొట్టెలు వంటి అభివృద్ధి పనులు ఉవ్వెత్తున చేపట్టడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కే దక్కుతుందన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న విజన్-2047 అమలులో యువనేత, మంత్రి నారా లోకేష్ బాబు కీలక భూమిక పోషించడం అభినందనీయం అని ఆయన కొనియాడారు.తాత నందమూరి తారక రామారావు కి తగ్గ మనవుడుగా, తండ్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచనలకు ప్రతిరూపంగా యువనేత మంత్రి నారా లోకేష్ బాబు నిర్ణయాలు ఉండడం విశేషం అని అయన పేర్కొన్నారు.పాలనలో పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ, ఆర్థిక కష్టాలు అన్నా ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తుండడం నారా లోకేష్ బాబు రాజకీయ చతురతను సూచిస్తుందన్నారు.నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ పథకాలు అమలులో కీలకంగా వ్యవహరిస్తూ, ప్రజలకు – ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తున్న విజయశ్రీ అని చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఏ. యం. సి. చైర్మన్ శిరసనంబేడు విజయభాస్కరరెడ్డి, నాయుడుపేట మునిసిపల్ వైస్ చైర్మన్ తెలుగు దేశం పార్టీ పట్టణ అధ్యక్షులు 786 రఫీ,యవనేత నెలవల రాజేష్, సూళ్లూరుపేట జనసేన పార్టీ సమన్వయకర్త ఉయ్యాల ప్రవీణ్,గూడూరు సుధీర్ రెడ్డి, అవదానం సుధీర్,విజయ్ కుమార్ నాయుడు,పెసల కిషోర్ బాబు,దార్ల రాజేద్ర,సంచి కృష్ణయ్య, నిత్య కృష్ణారెడ్డి, కాపులూరు చక్రపాణి,మెండెం బాబు, సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఓజిలి,పెళ్ళకూరు, నాయుడుపేట మండలాలకు చెందిన తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళా అధ్యక్షులు,నాయుకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..