ఇంచార్జ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన గొంతిరెడ్డి

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రత్తిపాడు నియోజకవర్గ సోషల్ మీడియా వింగ్ అధ్యక్షులుగా ఎన్నిక చేసినందుకు ఇంచార్జ్ ముద్రగడగిరి బాబును గొంతిరెడ్డి సతీష్ మర్యాదపూర్వకంగా కలిసారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ ముద్రగడ గిరిబాబు సూచనలతో ప్రత్తిపాడు నియోజకవర్గ సోషల్ మీడియా వింగ్ అధ్యక్షులుగా ఎంపిక చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాపై నమ్మకంతో నాకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి నాయకులు సహకారంతోకృషి చేస్తానని అన్నారు. నాకు ఈ అవకాశం కల్పించిన గురువర్యులు ముద్రగడ పద్మనాభం గారికి, ముద్రగడ గిరి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఈ సందర్భంగా సతీష్ మీడియాతో తెలిపారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *