

మన న్యూస్ నర్వ మండలం : నారాయణ పేట జిల్లా నర్వ మండల కేంద్రంలోని లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులని మహబూబ్ నగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మంగళవారం షాద్ నగర్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి ఆదేశానుసారం పెద్దకడుమూరు గ్రామానికి చెందిన వెంకట్ రాములు గౌడ్ రూ’23000 రూపాయలు, జక్కన్న పల్లి గ్రామానికి చెందిన జగదీశ్వర్ రెడ్డి రూ.24000 రూపాయల సీఎం సహాయనిధి చెక్కులు బాధిత కుటుంబ సభ్యులు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో నర్వ మండల సింగల్ విండో వైస్ చైర్మన్ లక్ష్మణ్, నర్వ మండల మాజీ యూత్ అధ్యక్షుడు జనార్ధన్, పెద్ద కడుమూరు గ్రామ అధ్యక్షుడు రాములు పాల్గొన్నారు.