

మన న్యూస్, నారాయణ పేట:ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల ఆప్రమత్తంగా ఉండాలని మరియు సైబర్ నేరాలు, దొంగతనాల పట్ల జాగ్రత్త పడాలని షి టీమ్ పోలీసులు చెన్నయ్య తెలిపారు.మరికల్ బస్టాండ్ వద్ద షి టీమ్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు సైబర్ నేరాలు, బస్సులలో ప్రయాణించేటప్పుడు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాహనాలు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సీసీ కెమెరాల ఉపయోగం, రోడ్డు భద్రత నియమాలు మొదలగు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షి టీమ్ పోలీసులు బాలరాజు, చెన్నయ్య లు మాట్లాడుతూ, ప్రజలు సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు గురికారాదని లాటరీ తగిలిందని, తక్కువడ్డికి లోన్ ఇస్తామని, గిఫ్ట్ ప్యాక్ లు వచ్చయి అని, తక్కువ రేట్ కి వాహనాలు దొరుకుతాయని, ఎవరైనా పై అధికారి వాట్సాప్ డీపీ పెట్టుకుని వాట్సాప్ లో మెసేజ్ చేసి డబ్బులు పంపమని అడిగితే పంపరాదు అని, మొబైల్ ఫోన్లో బ్లూ లింక్స్ ఓపెన్ చేయరాదని, ఎవరైనా ఓటీపీలు అడిగితే చెప్పరాదని మొదలగు మోసపూరిత ఆశలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని అనుకోకుండా సైబర్ నేరానికి గురైతే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.అలాగే బస్సులలో ప్రయాణం చేసేటప్పుడు ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, లగేజ్ బ్యాగులు విలువైన వస్తువులు, డబ్బులు, కిటికీల దగ్గరకు కూర్చున్నప్పుడు బంగారు గొలుసులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షి టీమ్ పోలీసులు జ్యోతి, కవిత, ప్రజలు, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.