పుత్తూరు , మన న్యూస్, జూన్ 8: అఖిల భారత క్షత్రియ మహాసభ – 1897 యువ విభాగం జాతీయ అధ్యక్షులు మనీష్ కుమార్ సింగ్ ను ఆంధ్రప్రదేశ్ అఖిల భారత క్షత్రియ మహాసభ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రాజు కోనేటి రవిరాజు, ఏపీ యువ విభాగం అధ్యక్షులు బాలసుబ్రమణ్యం రాజు, రాయలసీమ ఏరియా కోశాధికారి, రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన రాష్ట్ర అధికార ప్రతినిధి గుండ్రాజు సుకుమార్ రాజు, చాణిక్య వర్మ తదితరులు ఘనంగా సన్మానించారు. శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన ఆయనను స్థానిక క్షత్రియ సోదరులు కలసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మనీష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ భారతదేశంలో క్షత్రియ సంతతి అనూహ్యంగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయస్థాయిలో క్షత్రియుల ఐక్యతకు కృషి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలో జాతీయస్థాయిలో సమావేశాన్ని రాయలసీమ ఏరియాలో నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. తనను సత్కరించిన స్థానిక క్షత్రియులను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *