“తిలక్ వర్మపై ఆంధ్రుల అభిమానం అపారం.. మైదానంలో తెలుగు తేజం: మండల అధ్యక్షుడు ముని చంద్రారెడ్డి”.

“అంతర్జాతీయ వేదికపై తెలుగువారి కీర్తిని చాటిన తిలక్ వర్మ: టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా”.

​రేణిగుంట ఆగష్టు 17.
భారత యువ క్రికెట్ సంచలనం, తెలుగుజాతి గర్వకారణం తిలక్ వర్మకు తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో అభిమానులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. సోమవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనం కోసం ఆయన తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు.
​ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ మండల, పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తిలక్ వర్మకు పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అంతర్జాతీయ క్రికెట్ రంగంలో అద్భుత ప్రతిభతో రాణిస్తూ, తెలుగువారి కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్న తిలక్ వర్మను నాయకులు ఈ సందర్భంగా అభినందించారు.
​క్రికెట్ స్టార్‌ను చూసేందుకు విమానాశ్రయం వెలుపల అభిమానులు పోటీ పడ్డారు. ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు తీవ్ర ఉత్సాహం చూపించారు. అనంతరం ఆయన రేణిగుంట నుంచి రోడ్డు మార్గాన తిరుమల క్షేత్రానికి బయలుదేరి వెళ్లారు. స్వామివారి దర్శనం అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ ప్రయాణం కానున్నారు.
​ఈ కార్యక్రమంలో టిడిపి రేణిగుంట మండల అధ్యక్షుడు మునుచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషాలతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *