మన న్యూస్ తవణంపల్లె జూన్-6

పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం,‌ సరకల్లు పంచాయతీలో‌ పలు అభివృద్ధి కార్యక్రమాలు పూతలపట్టు శాసనసభ్యులు ‌మురళీమోహన్,‌ పలమనేరు శాసనసభ్యులు ‌అమరనాధ్ రెడ్డి పాల్గోన్నారు. ‌శుక్రవారం సరకల్లు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేలకు మండల నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మహిళా‌ సమావేశ భవనంను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం స్ధానిక మహిళతో‌ కలిసి‌ కొంత సేపు ముచ్చటించి రాష్ట్ర ప్రభుత్వం మహిళలు ఆర్ధిక అభివృద్ధికి అందిస్తున్న సంక్షేమ పధకాలు మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ‌పూతలపట్టు‌ నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *