మన న్యూస్ ఐరాల జూన్-6

పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, బొమ్మసముద్రం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారి దేవస్ధానం మహా కుంభాభిషేకం మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బొమ్మసముద్రం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు బొమ్మసముద్రం గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారిని దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో పాల్గోన్నారు. అనంతరం ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం అందించి, స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, ఐరాల మండల అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, తవణంపల్లె మండల అధ్యక్షులు దిలీప్ కుమార్ నాయుడు, కాణిపాకం మాజీ ఆలయ ఛైర్మెన్ మణినాయుడు, బంగారుపాళ్యం మార్కెట్ కమీటీ ఛైర్మన్ భాస్కర్ నాయుడు, మాజీ జెడ్పిటీసీ లతా బాబునాయుడు, టిడిపి సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ నాయుడు, హేమాద్రి నాయుడు, మద్దిపాట్లపల్లె చౌదరి, పవన్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ చిన్నబ్బ నాయుడు, కాణిపాకం మాజీ సర్పంచ్ మధుసూదనరావు, మరియు నాయకులు, కార్యకర్తలు, బొమ్మసముద్రం గ్రామస్తులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *