మన న్యూస్ తవణంపల్లె జూన్-6

పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండల కేంద్రంలోని పిహెచ్సీలో రక్త నమూనాల‌ సేకరణ కేంద్రంను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ప్రారంభించారు. శుక్రవారం తవణంపల్లె మండల‌ కేంద్రంలో ప్రారంభోత్సవానికి విచ్చేసిన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ని మండల నాయకులు పూలమాలు, దుశ్శాలువతో ఘనంగా సత్కరించి ఆహ్వానించారు. అనంతరం తవణంపల్లె పిహెచ్సీలో రూ. 50 లక్షలతో నూతనంగా నిర్మించిన రక్త నమూనాల సేకరణ కేంద్రంను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం నూతన హెల్త్ కేర్ సెంటర్ లో ప్రత్యేక పూజల్లో‌ పాల్గోని హెల్త్ కేర్ సెంటర్ ను పరిశీలించారు. అనంతరం అక్కడి వైద్యులు, సిబ్బందితో సమావేశమైన ఆయన రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంకా, మోహన్ వేలు, కేశవ నారాయణ, తవణంపల్లె మండల అధ్యక్షులు గాలి దిలీప్ కుమార్ నాయుడు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *