మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో కె.వి సూర్యనారాయణ అధ్యక్షతన ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి (బుజ్జి) ముఖ్యఅతిథిగా విచ్చేశారు. మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది పలు శాఖల అధికారులు సమాజంలో పాల్గొన్నారు, ప్రజా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు వారు సమాధానాలు ఇవ్వడం జరిగింది. సర్వసభ్య సమావేశం జరుగుతున్నప్పుడు నిత్యం గైర్హాజరవుతున్న సిడిపివో,
ఆర్ అండ్ బి,ఏలేరు ప్రాజెక్టు ఎఈ,
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రేంజర్, ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ, లేబర్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ ల పై ఎంపీపీ గొల్లపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు ప్రజాప్రతినిధుల వద్దకు వచ్చినప్పుడు ఆ సమస్యలు వినేందుకు కూడా ఒక్కరోజు కేటాయించకపోవడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు చిక్కాల రాజ్యలక్ష్మి లక్ష్మణరావు, సాదే లోవరాజు, మండల ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు ఉన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *