అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం..43వ డివిజన్ లో నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన టిడిపి నేతలు

మన న్యూస్,తిరుపతి :– రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ఏడాది పాలన దూసుకుపోతుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొనియాడారు. మంగళవారం 43వ డివిజన్ లో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి
ఆర్ పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మన్నూరు సుగుణమ్మ ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 4తో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తోందని, అభివృద్ధి సంక్షేమములో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం ముందుకు దూసుకెళ్తోంది అన్నారు. మహిళలకు అన్ని సదుపాయాలు సమకూర్చి, వృద్ధులకు పెన్షన్ 4 వేలకు ఒకటవ తారీకే అందజేయడం జరుగుతుందన్నారు. నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారన్నారు. తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ఆర్ పి శ్రీనివాసులు మాట్లాడుతూ అర్హులైన తెల్ల రేషన్ కార్డుదారులందరికీ నిత్యవసర సరుకులు ఒక్కసారి పట్టకుండా అందాలన్న లక్ష్యముతోనే 15 రోజులు పాటు రేషన్ షాపుల్లో ఇచ్చేలా ఏర్పాట్లు చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ఎంతో విజయవంతంగా పూర్తి కావస్తోందని, ప్రజలంతా సుభిక్షంగా సంతోషంగా ఉన్నారన్నారు. టిడిపి తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి మునిశేఖర్ రాయల్, శీను వెంకట్ రెడ్డి, ప్రసాద్, నళిని వెంకటేష్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శ్రీనాథ్ చౌక దుకాణం డీలర్ పావని రమణ పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..