

కలిగిరి, మన న్యూస్ : పులివెందుల ముద్దు బిడ్డ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పేర్ల పార్థసారధి రెడ్డి, అమరావతికి పోతూ దారి మధ్యలోనే ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం పెద్దపాడు గ్రామంలోని, ఆయన వారి మిత్రుడు యేండ్లురి రమణయ్య చౌదరి ఇంటిదగ్గర ఆత్మీయ మిత్ర బంధుత్వం జరిగింది. అనంతరం గ్రామంలోని టిడిపి నాయకులు ఆయనకు సాల్వలతో పూలమాలలతో సత్కరంచి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పేరుపేరునా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. తదుపరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పేర్ల పార్థసారధి రెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాలు తో గత నెలలో 27వ,తేదీ 28వ తేదీ, 29వ తేదీ, జరిగిన మహానాడు కార్యక్రమాల గురించి మరియు అక్కడ జరిగిన విషయాల గురించి చెప్పడం జరిగింది. అదే విదంగా మహానాడు కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్క టిడిపి నాయకులకు కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కడప గడ్డ తెలుగుదేశం అడ్డా అంటూ ఆయన తెలియజేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెల 1 వ తేదీ న ఎన్టీఆర్ పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల్లో రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరెరు. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలలో 3 ఉచిత గ్యాస్ సిలిండర్ లు, ఇవ్వడం జరిగింది, జూన్ నెలలో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, పథకాలను ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఆగస్ట్ నెల 15 వ తేదీన మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అదేవిదంగా రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు చేపట్టే ప్రతి కార్యక్రమంలో నాయకులందరూ కార్యకర్తలు అందరూ కలిసి పలు కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. గత వైసిపి హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను ఇబ్బంది గురిచేసిన ఏ ఒక్క నాయకుల్ని వదిలే పనిలేదంటూ ఆయన తెలియజేశారు. అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పలు కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకువెళ్లాలన్నారు. కాకర్ల సురేష్ కాకర్ల ట్రస్ట్ పెట్టి పేదలకు అండగా నిలిచారని ఆయన అన్నారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గాన్ని చాలా స్పీడ్ గా అభివృద్ధి పథంలో నడుపుతున్నారని ఆయన తెలియజేశారు. కాకర్ల సురేష్ కి ఉదయగిరి నియోజకవర్గం లో మంచి పట్టు ఉంది ఆయన అనుకున్న ప్రతి పనిని విజయవంతం చేస్తాడు కాబట్టి నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఆయన వెనకుండి ఆయన చేపట్టే అభివృద్ధి పనులకు తోడుండాలన్నారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మంచి త్రులున్న నాయకుడు కాకర్ల సురేష్ ఆయన గెలిపించుకున్నందుకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపాడు గ్రామ నాయకులు గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు