మన న్యూస్ తవణంపల్లె జూన్-1

తవణంపల్లి మండల పరిధిలోని దిగువమత్యం సిఎస్ఐ చర్చి నందు పాస్టర్ శ్యాం ప్రసాద్ ఆధ్వర్యంలో దేవుని సందేశం స్కూల్ పిల్లలకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా గత నెలగా సెలవులో ఉన్న పిల్లలకు మరియు డీఎస్సీ పరీక్షలకు వెళ్లే యువకులకు యువతులకు సీఎస్ఐ చర్చ్ పాస్టర్ శ్యాం ప్రసాద్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పిల్లలకు జ్ఞానము ఆలోచన మంచి నడవడికలు తల్లిదండ్రులు గురువులను పెద్దలను గౌరవించడం సమాజంలో మంచి నడవడిక మార్పులు గూర్చి వివరించారు. అదేవిధంగా పాస్టర్ శ్యాం ప్రసాద్ కి తవణంపల్లి మండల అరగొండ పాస్టర్ కమిటీ చైర్మన్ నియమితులైన పాస్టర్ గారిని సాలవులతో ఘనంగా సన్మానించారు. అదే విధంగా ఎగుమత్యం పలు చర్చిలలో వారికి ఘనంగా సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపదేశికులు దాము గ్రామ పెద్దలు క్రైస్తవ సంఘ సభ్యులు యువతులు యువకులు పిల్లలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *