​రేణిగుంట పట్టణంలో అత్యంత వైభవంగా జరిగే గంగమ్మ జాతర సందర్భంగా భక్తుల భద్రత మరియు ట్రాఫిక్ నియంత్రణను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు రేణిగుంట సీఐ జయచంద్ర తెలిపారు. జాతర మహోత్సవానికి ప్రజలు, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున, పట్టణంలో ట్రాఫిక్ స్తంభించకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ నెల 18 మరియు 19 తేదీలలో రేణిగుంట పట్టణంలోకి బస్సులు, భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ట్రాఫిక్ మళ్లింపు వివరాలు:

  • తిరుపతి నుండి శ్రీకాళహస్తి వైపు: తిరుపతి మార్గం నుండి రేణిగుంట మీదుగా శ్రీకాళహస్తి వైపు వెళ్లే బస్సులు మరియు భారీ వాహనాలను రేణిగుంట పట్టణంలోకి రానివ్వకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తారు.
  • శ్రీకాళహస్తి నుండి తిరుపతి వైపు: ಅದೇవిధంగా శ్రీకాళహస్తి వైపు నుండి తిరుపతి వైపు వచ్చే వాహనాలు కూడా రేణిగుంట పట్టణ పరిధిలోకి ప్రవేశించకుండా నిర్దేశించిన బైపాస్ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారానే రాకపోకలు సాగించాల్సి ఉంటుంది.

ప్రయాణికులు, విద్యార్థులకు విజ్ఞప్తి:

​ఈ రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని, ప్రయాణికులు మరియు విద్యార్థులు ఈ మార్పులను ముందుగానే గమనించి తమ ప్రయాణానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సీఐ జయచంద్ర సూచించారు.

​ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక ట్రాఫిక్ మరియు పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తూ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లిస్తారని తెలిపారు. జాతర సమయంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రజలు, వాహనదారులు మరియు ఆర్టీసీ ప్రయాణికులు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించి, సూచించిన డైవర్షన్ మార్గాలను పాటించాలని సీఐ జయచంద్ర విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *