మెగా డీఎస్సీ నుండి ఏజెన్సీ టీచర్ పోస్టులో మినహాయించాలి

మన న్యూస్ పాచిపెంట మే 1:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో షెడ్యూల్ ఏరియాలో 100% ఉద్యోగాలు ఆదివాసులకే కల్పించాలని ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ సాధన కోసం మే 31 నుండి జూన్ 4వ తేదీ వరకు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట నుండి కేఆర్ పురం వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా మీదుగా నిర్వహిస్తున్న రాష్ట్ర జీపు జాత సందర్భంగా ఈరోజు పాచిపెంట మండలం పెద్ద చీపురు వలస గ్రామం వద్ద ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో గ్రామ పెద్ద అయిన రేయ్యి లచ్చయ్య ఆధ్వర్యంలో సభ జరిగింది ముందుగా అధిక సంఖ్యలో రాష్ట్ర జీపు జాత ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర కే అశోక్ కుమార్ కి స్వాగతం పలికిన గిరిజనులు. అనంతరం గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో 100% ఉద్యోగ ఉపాధ్యాయ నియామకం చట్టం చేయాలని ఏజెన్సీ స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని మెగా డీఎస్సీ నుండి ఏజెన్సీ పోస్టులు మినహాయించాలని ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్ చేస్తోందని అన్నారు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం కోటమీ ప్రభుత్వం జీవో నెంబర్ త్రీ ని కొనసాగిస్తానని చెప్పి ఈరోజు గిరిజనులకు ద్రోహం చేస్తూ మాట మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆరు శాతం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమల వలన ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులు 766 పోస్టులకు ఆదివాసులకే దక్కేది కేవలం 42 పోస్టులు మాత్రమే అని ఆవేదన వ్యక్తం చేశారు గిరిజన సంక్షేమ మంత్రి ఆదివాసులకు 2000 పోస్టులు వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని 100% ఉన్న ఆదివాసీలకు 6% ఉద్యోగాలు నాలుగు శాతం ఉన్న గిరిజనేతలకు 94% ఉద్యోగాలు దక్కడాన్ని ఆదివాసి గిరిజన సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు.అలాగే గిరిజనులు అనేకమంది పోరాటాల ఫలితంగా సాధించుటకు ఉన్నటువంటి గిరిజన చట్టాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని వన్ బై సెవెంటీ చట్టాన్ని పీసా చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని అటవీ ఆకులు చట్టం ప్రకారం ప్రతి గిరిజన కుటుంబానికి పది ఎకరాలు చొప్పున అంతకన్నా తక్కువ ఉంటే ఎంత సాగులో ఉంటే అంత ఇవ్వాలని కానీ నేడు అలా జరగకుండా ఎకరం రెండు ఎకరాలు 50 సెంట్లు 20 సెంట్లు చొప్పున పట్టాలు మంజూరు చేసి గిరిజనులకు అడవుల నుండి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే ఏజెన్సీ ప్రాంతాల్లో 100% ఉద్యోగ ఉపాధ్యాయ నియామకాలు చట్టం చేయాలని మెగా డీఎస్సీ నుంచి ఏజెన్సీ టీచర్ పోస్టులు మినహాయించి ఏజెన్సీ స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని నాన్ షెడ్యూల్ గ్రామాలను షెడ్యూల్ గ్రామాల్లో చేర్చి గిరిజనులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ రాష్ట్ర జాత సందర్భంగా భవిష్యత్తులో ఆదివాసి గిరిజన సంఘానికి ప్రజలందరూ కూడా అన్ని కార్మిక సంఘాలు అండగా నిలవాలని కోరారు. భవిష్యత్ పోరాటాలకి గిరిజం అంతా ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు.సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు చెల్లూరి జగన్నాథం, రేయి గంగరాజు సూరయ్య తదితరులు పాల్గొన్నారు.పాచిపెంట మండలం పెద్దచీపురు వలస వద్ద గిరిజనుల ఉద్దేశించి మాట్లాడుతున్న ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర ఈ కార్యక్రమంలో సంబంధిత గిరిజనులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..