మన న్యూస్,తిరుపతి:
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ను క్లస్టర్ ఇంచార్జ్, టిడిపి రాష్ట్ర సీనియర్ నాయకులు జేబీ శ్రీనివాస్ శనివారం సాయంత్రం తిరుమలలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ ను శాలువా తో ఘనంగా సత్కరించారు. అనంతరం జేబీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ టిటిడి చైర్మన్ గా బి ఆర్ నాయుడు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమలలో భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నారని, ఎంత రద్దీ ఉన్నప్పటికీ కావలసిన అన్ని సదుపాయాలను కల్పించడంలో బీ ఆర్ నాయుడు చైర్మన్ తో పాటు పాలకవర్గం బాగా పని చేస్తోందని చెప్పారు. తిరుమలలో వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలను క్రమబద్ధీకరించి భక్తుల మన్ననలను పొందుతున్నారని జెబి శ్రీనివాస్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *